ETV Bharat / business

ఆరోగ్య రంగానికి రెట్టింపు వ్యయం- కొత్తగా అగ్రిసెస్

author img

By

Published : Feb 1, 2021, 5:37 PM IST

Sitharaman doubles healthcare spending, imposes new agri cess in Budget for FY22
ఆరోగ్య రంగానికి రెట్టింపు వ్యయం- కొత్తగా అగ్రిసెస్

కరోనా టీకా పంపిణీ సహా, మెరుగైన వైద్య సేవల కోసం ఆరోగ్య రంగ వ్యయాన్ని రెట్టింపు చేసినట్లు తెలిపారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు కొత్తగా అగ్రి సెస్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఎక్సైజ్, దిగుమతి సుంకాల్లో కోత విధిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్​ 2021-22ను ప్రవేశ పెట్టారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ఆరోగ్య రంగ వ్యయాన్ని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కొన్ని వస్తువులపై కొత్తగా అగ్రి సెస్ విధించనున్నట్లు ప్రకటించారు. కాటన్, రా సిల్క్​, ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు బడ్జెట్​లో ప్రతిపాదించారు.

బడ్జెట్​లో పదవీ విరమణ నిధిపై పన్ను రహిత వడ్డీని ఏడాదికి రూ .2.5 లక్షలకు పరిమితం చేశారు. అయితే ప్రత్యేక ఖర్చులకు లోబడి లీవ్ ట్రావెల్​ కన్సెషన్​(ఎల్​టీసీ)పై పన్ను మినహాయింపు ఇచ్చారు.

ఇదీ చూడండి:- కుదేలైన దేశానికి ఆర్థిక టీకా- ఏ రంగానికి ఎంత?

సుంకం పెరిగినా భారం పడకుండా..

బంగారం, ఆల్కహాల్​, బొగ్గు సహా యాపిల్​ నుంచి పప్పు ధాన్యాల వంటి వ్యవసాయ ఉత్పత్తులపై మంగళవారం నుంచి కొత్తగా అగ్రికల్చర్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్​ సెస్​(ఏఐడీసీ)ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 సెస్​ను విధించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:- నిర్మలమ్మ '2021 బడ్జెట్'​ హైలైట్స్​ ఇవే...

అయితే వినియోగదారులపై ఈ భారం పడకుండా ఈ వస్తువులపై కస్టమ్స్ లేక, దిగుమతి సుంకాన్ని తగ్గించనున్నట్లు నిర్మల వెల్లడించారు.

బడ్జెట్​లోని కీలక అంశాలు..

  • ఇకపై రూ.10 కోట్ల టర్నోవర్ దాటిన​ వ్యక్తులు ఏడాదికి రూ .50 లక్షలకు మించిన వస్తువుల కొనుగోలు చేస్తే 0.1 శాతం టీడీఎస్​ విధించన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
  • 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పన్ను చెల్లింపులో ఊరట కల్పించింది కేంద్రం. పెన్షన్​, వడ్డీ మాత్రమే ఆదాయంగా ఉన్నవారికి ఐటీ రిటర్ను దాఖలు నుంచి మినహాయింపునిచ్చింది.
  • గృహ రుణాలు తీసుకుని అందుబాటు ధరల్లో ఇళ్లు కొనుగోలు చేసినవారికి రాయితీ ప్రకటించారు నిర్మల. 2019 బడ్జెట్‌లో ప్రకటించిన వడ్డీ రాయితీ రూ.లక్షా 50వేలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
  • పన్ను విధింపులో అసమతుల్యత కారణంగా విదేశీ పదవీ విరమణ ప్రయోజనాల ఖాతాలో వచ్చే ఆదాయానికి సంబంధించి ఎన్​ఆర్​ఐలు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించడానికి, కొత్త నిబంధనలు నోటిఫై చేస్తామని నిర్మల ప్రకటించారు.
  • బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు.
  • పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి, డివిడెండ్ ప్రకటించిన లేదా చెల్లించిన తర్వాతే.. ఆదాయంపై ముందస్తు పన్ను వసూలు చేయనున్నట్లు తెలిపారు.
  • రియల్​ ఎస్టేట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ట్రస్టులు, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఇన్వెస్ట్​మెంట్ ట్రస్టులకు చెల్లించే డివిడెండ్లకు టీడీఎస్​ వినహాయింపు ఇవ్వనున్నారు.
  • అంకుర సంస్థలకు పన్ను మినహాయింపు మరో ఏడాది పాటు పొడిగించారు.
  • ఆదాయపు పన్ను విలువ కట్టే కేసుల తిరిగి తెరిచే కాల పరిమితిని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు కుదించారు. 50 లక్షల రూపాయలకు పైబడిన కేసులకు మాత్రం ఈ కాల పరిమితి పదేళ్లుగా ఉంది.
  • తన బడ్జెట్ ప్రసంగంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021-22) స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 6.8 శాతం ఆర్థిక లోటు ఉంటుందని అంచనా వేశారు నిర్మల. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గతంలో అంచనా వేసినట్లుగా 3.5 శాతం కాకుండా 9.5 శాతం లోటుతో ముగుస్తుందని తెలిపారు.
  • ఆరోగ్య రంగం కోసం జీడీపీలో 1 శాతానికిపైగా ఖర్చు చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు. ప్రజలకు కరోనా టీకా పంపిణీ సహా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ .2.2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి రూ.94,452కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు భారీగా పెంచినట్లు చెప్పారు.
  • మొండి బాకీలతో సమస్యలు ఎదుర్కొంటూ, వృద్ధి మందగమనంలో సాగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన సాయం కోసం రూ.20వేల కోట్లు కేటాయించినట్లు విత్త మంత్రి ప్రకటించారు.
  • ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరించడం ద్వారా రూ.1.75లక్షల కోట్ల ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్​ఐసీ ఐపీఓ ఉండనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: ప్రియం కానున్న ఫోన్లు- దిగిరానున్న బంగారం

బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గింపు

బడ్జెట్​లో కొత్త సుంకాలు- ఏ వస్తువుపై ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.