ETV Bharat / business

10 కోట్ల టీకాలు సిద్ధం చేస్తున్న సీరం- ధర..?

author img

By

Published : Aug 7, 2020, 5:58 PM IST

భారత్​ సహా ఇతర పేద, మధ్య ఆదాయ దేశాలకు 10 కోట్ల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు సీరం సంస్థ సీఈఓ అదర్​ పునావాలా. గావి, బిల్​ అండ్​ మెలిండా పౌంఢేషన్​ సహకారంతో వ్యాక్సిన్​ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. టీకా ధర రూ.225కన్నా తక్కువే ఉంటుందని స్పష్టంచేశారు.

Serum Institute to provide 10 crore Covid vaccines for India, other countries
10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్న సీరం సంస్థ

కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. పలు సంస్థలు మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ను ఇప్పటికే ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో 2021నాటికి 10 కోట్ల వ్యాక్సిన్​ డోసులను భారత్​ సహా పేద, మధ్య ఆదాయ దేశాల కోసం సిద్ధం చేస్తామని చెప్పారు పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా. గావి, బిల్​ అండ్ మెలిండా ఫౌండేషన్​ సహకారంతో వ్యాక్సిన్ ప్రాజెక్టు పనులకు వేగవంతం చేసినట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

వ్యాక్సిన్ ధర రూ.225(3 డాలర్లు)కు మించదని స్పష్టం చేశారు పూనావాలా. మొత్తం 92 దేశాలకు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు.

వ్యాక్సిన్ అభివృద్ధి​ ప్రాజెక్టులో భాగంగా బిల్​ అండ్​ మెలిండా ఫౌండేషన్​ 150 మిలియన్​ డాలర్లను గావికి సమకూర్చుతుంది. వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేసేందుకు ఈ నిధులను సీరం సంస్థకు ఇవ్వనుంది గావి.

అమెరికన్ వ్యాక్సిన్​ సంస్థ నోవావాక్స్.. తన కొవిడ్​ వ్యాక్సిన్ అభివృద్ధి వాణిజ్యీకరణ కోసం సీరం సంస్థతో సరఫరా, లైసెన్స్ ఒప్పందం కుదర్చుకున్నట్లు ప్రకటించిన మరునాడే 10 కోట్ల వ్యాక్సిన్​ డోసుల విషయాన్ని వెల్లడించారు పూనావాలా.

సీరం సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్​ తయారీదారు. కొవిడ్ వ్యాక్సిన్​ ఉత్పత్తి కోసం ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికాలతో కలిసి పనిచేస్తోంది. వ్యాక్సిన్​ 2, 3వ దశ ప్రయోగాల కోసం సీరం సంస్థకు డీసీజీఐ ఇప్పటికే అనుమతిచ్చింది.

ఇదీ చూడండి: 'నవ భారత్​ నిర్మాణానికి కొత్త విద్యా విధానమే పునాది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.