ETV Bharat / business

కరోనా పంజాకు మార్కెట్లు విలవిల

author img

By

Published : Feb 28, 2020, 9:27 AM IST

Updated : Mar 2, 2020, 8:12 PM IST

STOCKS OPEN
స్టాక్ మార్కెట్లు

15:42 February 28

వారాంతపు సెషన్​లో స్టాక్​ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఐదు నెలల కనిష్ఠానికి సూచీలు జారుకున్నాయి. కరోనా వైరస్​ ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.

2015 ఆగస్టు 24 తర్వాత ఆ స్థాయిలో నేడు మార్కెట్లు నష్టపోయాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 1,448 పాయింట్లు కోల్పోయి 38, 297 పాయింట్లకు చేరుకుంది. 431 పాయింట్లు నష్టపోయిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ.. 11,202 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జీడీపీ ప్రభావమూ..

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలకు తోడు నేడు విడుదల కానున్న 2019-20 మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలపై ప్రతికూల అంచనాలు.. మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

రూ.5 లక్షల కోట్లు ఆవిరి..

భారీ నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది.

టాటా స్టీల్ 8 శాతానికిపైగా నష్టపోయింది. బజాజ్​ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. దాదాపు అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయి.

విమానయానం, ఆటో షేర్లు కుదేలు..

కరోనా నేపథ్యంలో విమానయాన సంస్థలకు ప్రతికూల రేటింగ్​ (నెగెటివ్)ను కొనసాగిస్తున్నట్లు 'ఇక్రా' ప్రకటించింది. ఈ కారణంగా విమానయాన సంస్థల షేర్లు దాదాపు 10 శాతం మేర నష్టాల్లోకి జారుకున్నాయి.

స్టాక్​ మార్కెట్లలో వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. కరోనా ప్రభావంతో సరఫరా వ్యవస్థ నిలిచిపోవటం వల్ల ఆటో షేర్లు 9 శాతం పడిపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు 4 శాతం మేర పడిపోయాయి. ఆసియాలో షాంఘై 3.71 శాతం, జపాన్​ 3.67 శాతం, హాంకాంగ్​ 2.42 శాతం, దక్షిణ కొరియా 3.30 శాతం పతనమయ్యాయి.

15:07 February 28

1,500 పాయింట్ల పతనానికి చేరువలో సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాలను నమోదు చేశాయి. 2015 తర్వాత ఆ స్థాయిలో అత్యధిక నష్టాన్ని నేడు నమోదు చేశాయి సూచీలు. సెన్సెక్స్​ ప్రస్తుతం 1,480 పాయింట్ల నష్టంతో 38,265 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ఏకంగా 436 పాయింట్ల నష్టంతో 11,197 వద్దకు చేరింది.

14:55 February 28

1,300 దాటిన సెన్సెక్స్ నష్టం..

సెషన్ ముగింపునకు ముందు స్టాక్ మార్కెట్లు మరింత కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ 1,330 పాయింట్లకు పైగా నష్టంతో ప్రస్తుతం 38,415 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 392 పాయింట్ల పతనంతో ప్రస్తుతం 11,240 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

14:29 February 28

30 shares index
30 షేర్ల ఇండెక్స్​

మరింత క్షీణించిన సూచీలు..

వారాంతపు సెషన్ ముగింపునకు ముందు స్టాక్ మార్కెట్లు మరింత భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1,300 పాయింట్ల నష్టానికి చేరువలో ఉంది. ఈ సూచీ ప్రస్తుతం 1,278 పాయింట్ల నష్టంతో..38,466 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల నష్టానికి చేరువలో ఉంది. ఈ సూచీ ప్రస్తుతం 386 పాయింట్ల పతనంతో 11,247 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

30 షేర్ల ఇండెక్స్​లో అని షేర్లూ నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ 50లో గెయిల్ మినహా.. మిగతా షేర్లన్నీ నష్టాల్లో కొసాగుతున్నాయి.

13:47 February 28

ఆటో షేర్ల పతనం..

స్టాక్​ మార్కెట్లలో వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. వాహన సంస్థలు 9 శాతం మేర నష్టపోయాయి. కరోనా ప్రభావంతో సరఫరా వ్యవస్థ నిలిచిపోవటం వల్ల ఆటో షేర్లు పడిపోయాయి.  

12:39 February 28

30 shares index
30 షేర్ల ఇండెక్స్ మిడ్ సెషన్ తర్వాత

నష్టాల్లోనే సూచీలు..

మిడ్​ సెషన్ తర్వాత మరింత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1,210 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 38,535 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 362 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 11,270 వద్ద కొనసాగుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

12:06 February 28

విమానయాన రంగానికి కరోనా గండం..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​లోనూ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 1,191 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 38,553 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 356 పాయింట్లకు పైగా నష్టంతో..11,276 వద్ద కొనసాగుతోంది.

కరోనా నేపథ్యంలో విమానయాన సంస్థలకు ప్రతికూల రేటింగ్​ (నెగెటివ్​)ను కొనసాగిస్తున్నట్లు 'ఇక్రా' ప్రకటించింది. ఈ కారణంగా విమానయాన సంస్థల షేర్లు దాదాపు 10 శాతం మేర నష్టాల్లోకి జారుకున్నాయి.

11:16 February 28

30 shares index
30 షేర్ల ఇండెక్స్​

టాటా స్టీల్​ కుదేలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1168 పాయింట్లు కోల్పోయి ప్రస్తుతం 38,577 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 338 పాయింట్ల నష్టంతో 11,294 వద్ద కొనసాగుతోంది.  

టాటా స్టీల్ 8 శాతానికిపైగా నష్టపోయింది. బజాజ్​ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఎన్​టీపీసీ మాత్రమే స్వల్ప లాభాల్లో ఉంది.

10:10 February 28

రూ.5 లక్షల కోట్లు ఆవిరి..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1042 పాయింట్ల నష్టంతో 38,703 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 317 పాయింట్ల క్షీణతతో 11,315 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

భారీ నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపంద రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది.

09:45 February 28

వారాంతంలో కుదేలు..

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లన్నీ కరోనా భయాలతో కుదేలవుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడింది. వీటికి తోడు నేడు విడుదల కానున్న 2019-20 మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలపై ప్రతికూల అంచనాలు.. మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1123 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 38,622 వద్దకు చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 329 పాయింట్లకు పైగా క్షీణతతో 11,303 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

బీఎస్​ఈ 30, నిఫ్టీ 50లో అన్ని షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

టాటా స్టీల్, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, బజాజ్ ఫినాన్స్, ఎం&ఎం షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

09:24 February 28

భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

  • ఆరంభంలోనే వెయ్యికి పైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌
  • 280 పాయింట్లకు పైగా పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • భారత స్టాక్‌మార్కెట్లపై ప్రపంచ మార్కెట్ల ప్రభావం
  • ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లపై కరోనా వైరస్‌ ప్రభావం
  • ఇటలీ, కొరియా తదితర దేశాల్లో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
  • నష్టాల్లోనే సాగుతున్న ప్రపంచ మార్కెట్లు
Last Updated :Mar 2, 2020, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.