ETV Bharat / business

Petrol Prices: వరుసగా మూడోరోజూ పెరిగిన ఇంధన ధరలు

author img

By

Published : Oct 16, 2021, 8:57 AM IST

petrol diesel price today
ఇంధన ధరలు

దేశంలో ఇంధన​ ధరలు (Fuel Price Today) పెంపు కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​పై 36 పైసలు, డీజిల్​పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు((Petrol price hike)) వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు((Fuel Price Today) 15 సార్లు ఎగబాకాయి. తాజాగా శనివారం లీటర్‌ పెట్రోల్ 36 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.105.49కు చేరగా.. డీజిల్​ ధర రూ.94.22కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర (Mumbai Diesel Price Today) 34 పైసలు పెరిగి రూ.111.43కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర 37 పైసలు పెరిగి రూ.102.15 వద్ద కొనసాగుతోంది.

కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Today Diesel Price) ధర రూ.106.10కి చేరింది. లీటర్​ డీజిల్​ ధర​ రూ.97.33గా ఉంది.

చెన్నైలో లీటర్​ పెట్రోల్​​ (Chennai Diesel Price Today) ధర రూ.102.70 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర​ రూ.98.59గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 36పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.109.73కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​ రూ.102.80కి చేరింది.

గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 35 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.111.78గా ఉంది. డీజిల్​ లీటర్​కు 37 పైసలు పెరిగి.. రూ.104.26 వద్ద ఉంది.

విజయవాడలో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర.. రూ.111.58 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.06కు చేరింది.

ఇదీ చూడండి: Crude Oil Price: మూడేళ్ల గరిష్ఠానికి క్రూడాయిల్​ ధరలు- మరి భారత్​లో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.