ETV Bharat / business

'బాయ్​కాట్​ చైనా' అంటూనే ఆ ఫోన్లను భారీగా కొనేశారు..

author img

By

Published : Jun 20, 2020, 11:25 AM IST

భారత్​లో 'మేడ్​ ఇన్​ చైనా' ఉత్పత్తులపై వ్యతిరేకత పెరుగుతోన్నా వన్​ ప్లస్​ ఫోన్లకు డిమాండ్ తగ్గలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెజాన్​ పోర్టల్​లో విక్రయాలు ప్రారంభించిన నిమిషాల్లోనే చైనాకు చెందిన వన్​ప్లస్​ 8 ప్రో ఫోన్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోయినట్లు వెల్లడించారు. బాయ్​కాట్​ చైనా ప్రభావం వీటిపై కనిపించలేదని నిపుణులు అంటున్నారు.

oneplus 8pro sales
వన్​ ప్లస్​

చైనా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 8 ప్రోను అమెజాన్ ఇండియాలో గురువారం విక్రయాలు ప్రారంభించింది. నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని చాలా మంది పిలుపునిస్తున్నారు. సామాజిక మాధ్యమ వేదికల్లో బాయ్​కాట్​ చైనా అంటూ నినదిస్తున్నారు. కానీ, వన్​ప్లస్​ 8 అమ్మకాలు తీరు దీనికి భిన్నంగా ఉందని చెప్పవచ్చు.

వ్యతిరేకత పెరిగినా..

దేశంలోని వినియోగదారుల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరిగిందని ఇటీవల కౌంటర్​పాయింట్​ రీసెర్చ్​ నివేదిక వెల్లడించింది. కరోనా మూలాలు చైనాలోని వుహాన్​లో ఉండటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం అంచనావేసింది. సగానికిపైగా భారత వినియోగదారులు మేడ్​ ఇన్​ చైనా వస్తువులపై ప్రతికూల భావంతో ఉన్నట్లు తెలిపింది.

వన్​ ప్లస్​ 8 శ్రేణిని ఏప్రిల్​లో విడుదల చేసింది సంస్థ. అయితే లాక్​డౌన్ కారణంగా భారత్​లో మే 18న వన్​ప్లస్​ 8 స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయగా జూన్​ 15న వన్​ప్లస్​ 8 ప్రోను అందుబాటులోకి తెచ్చింది. వన్​ప్లస్​, అమెజాన్​.. ఎన్ని ఫోన్లు అమ్మారో స్పష్టత ఇవ్వలేదు. అయితే భారత్​లో వన్​ప్లస్​ ఫోన్లకు డిమాండ్ అధికంగానే ఉంది. ఫలితంగా నిమిషాల్లోనే అన్ని అమ్ముడుపోయినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వన్​ప్లస్​ 8 ప్రత్యేకతలు..

6.55 అంగుళాల తెర

మూడు రంగుల్లో లభ్యం

స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్​

12 జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​

వెనుకవైపు మూడు కెమెరాలు

4300 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ

30 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​

వన్​ప్లస్​ 8 ప్రో

6.67 అంగుళాల క్వాడ్​ హెచ్​డీ +120 హెర్జ్​ స్క్రీన్​

5 జీ సపోర్ట్​తో స్నాప్​డ్రాగన్​ 865 ప్రాసెసర్​

12 జీబీ ర్యామ్​- 256 జీబీ ఆన్​బోర్డ్​ స్టోరేజ్

వెనుక భాగంలో రెండు 48 ఎంపీ సెన్సార్లతో క్వాడ్​-కెమెరా సెటప్​-

20 ఎంపీ సెల్ఫీ షూటర్​

4710 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ

30 వోల్ట్​ వైర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్

ఐపీ 68 వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​

ఇదీ చూడండి: భారత్​లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.