ETV Bharat / business

త్వరలో భారత్​కు 15 వేల టన్నుల ఉల్లి!

author img

By

Published : Nov 6, 2020, 2:01 PM IST

Updated : Nov 6, 2020, 2:24 PM IST

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యలు వేగవంతం చేసింది నాఫెడ్. 15వేల టన్నుల ఉల్లి దిగుమతికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసింది.

Nafed finalises bidders, issues order for supply of 15,000 tonnes of imported onions
త్వరలో భారత్​కు 15 వేల టన్నుల ఉల్లి!

దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది నేషనల్​ అగ్రికల్చరల్​ కోపరేటివ్​ మార్కెటింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా(నాఫెడ్​). విదేశాల నుంచి 15 వేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకునేందుకు బిడ్లు ఖరారు చేసింది. తూత్తుకుడి, ముంబయి ఓడ రేవులకు వచ్చే ఉల్లిని త్వరితగతిన దేశంలోని అన్ని రాష్ట్రాలకు చేరవేయడంపైనా నాఫెడ్ కసరత్తు ప్రారంభించింది. ఎవరికి ఎంత పరిమాణం కావాలో ముందే చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

గతేడాది కంటే భిన్నంగా..

టర్కీ, ఈజిప్ట్​ల నుంచి గతేడాది నేరుగా ఉల్లిపాయల్ని దిగుమతి చేసుకుంది కేంద్రం. అయితే.. ఈసారి ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యత అప్పగించింది. ఇలా చేయడం ద్వారా సరకు నాణ్యత బాగుంటుందని నాఫెడ్ వర్గాలు తెలిపాయి. ఉల్లి నాణ్యత, పరిమాణం ఎలా ఉండాలన్న అంశంపైనా సరఫరాదారులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి: సాగులో స్వావలంబనకు చోటేదీ?

Last Updated : Nov 6, 2020, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.