ETV Bharat / business

సంపన్నుల్లో మళ్లీ అంబానీ​ టాప్- ఆస్తి ఎంతంటే...

author img

By

Published : Sep 25, 2019, 4:32 PM IST

Updated : Oct 1, 2019, 11:45 PM IST

ఐఐఎఫ్​ఎల్​ వెల్త్​ హురున్​ ఇండియా... భారత్​లోనే అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రూ.3,80,700 కోట్ల నికర సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముఖేశ్​ అంబానీ మరోసారి భారత్​లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ జాబితాలో హిందుజా అండ్​ ఫ్యామిలీ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్​జీ మూడో స్థానంలో నిలిచారు.

సంపన్నుల్లో మళ్లీ అంబానీ​ టాప్- ఆస్తి ఎంతంటే...

అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్​ అంబానీ మరోసారి భారత్​లోనే అత్యంత ధనవంతునిగా నిలిచారు. ఐఐఎఫ్​ఎల్​ వెల్త్​ హురున్​ ఇండియా విడుదల చేసిన తాజా జాబితాలో రూ.3,80,700 కోట్ల నికర సంపదతో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. ముఖేశ్​ ఇలా అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఎనిమిదోసారి.

రూ.1,86,500 కోట్లతో...లండన్​కు చెందిన ఎస్పీ హిందుజా అండ్​ ఫ్యామిలీ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. రూ.1,17,100 కోట్ల సంపదతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్​ ప్రేమ్​జీ మూడో స్థానంలో నిలిచారు. ఈ ధనవంతుల జాబితాలో 152 మంది మహిళలు చోటుసంపాదించడం విశేషం.

ఐఐఎఫ్​ఎల్​ వెల్త్​ హురున్​ ఇండియా రిచ్​​ లిస్ట్​ ప్రకారం.. వెయ్యి కోట్లకుపైగా సంపద కలిగిన భారతీయుల సంఖ్య 2018లో 831కాగా, 2019లో 953కి పెరిగింది. అయితే యూఎస్​ డాలర్​ ఆధారంగా చూస్తే బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి తగ్గింది.

"భారత ధనవంతుల జాబితాలోని మొదటి 25మంది సంపద.. భారత జీడీపీలో 10 శాతానికి సమానం. మొత్తం 953 మంది ధనవంతుల సంపద కలిపితే అది 27 శాతంగా ఉంది."
- ఐఐఎఫ్​ఎల్​ వెల్త్​ హురున్​ ఇండియా రిట్​ లిస్ట్

ఆర్సెలర్ మిత్తల్​ ఛైర్మన్​, సీఈఓ ఎల్​ఎన్​ మిత్తల్​ రూ.1,07,300 కోట్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు. రూ.94,500 కోట్లతో గౌతమ్ ఆదానీ ఐదో స్థానంలో నిలిచారు.

ఇదీ చూడండి: సర్వత్రా ప్రతికూలం... మార్కెట్లకు భారీ నష్టం

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 25 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0952: SAfrica UK Royals Tutu AP Clients Only 4231676
Prince Harry, Meghan, son meet Archbishop Tutu
AP-APTN-0949: Australia Marijuana No access Australia 4231674
Australian capital legalises recreational marijuana
AP-APTN-0949: China MOFA Briefing AP Clients Only 4231667
DAILY MOFA BRIEFING
AP-APTN-0948: US Trump Iraq AP Clients Only 4231673
Trump meets Iraqi president in New York
AP-APTN-0945: UN Johnson Rouhani AP Clients Only 4231671
UK PM Johnson meets Iran President Rouhani
AP-APTN-0931: ARCHIVE Algeria Bouteflika No access Algeria 4231669
Algerian ex-president's brother, others convicted
AP-APTN-0914: UK Parliament Reax AP Clients Only 4231666
Reaction outside UK parliament after ruling
AP-APTN-0907: US OH Drone Dropoff Jail Must credit Cuyahoga County via NEWS5; No access Cleveland; No use US broadcast networks; No re-sale, re-use or archive 4231665
Drone dropped phone, drugs into US jail
AP-APTN-0829: US NY Trump Impeachment Reax AP Clients Only 4231662
Trump: impeachment inquiry worst witch hunt
AP-APTN-0822: UK Ruling Gove No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4231659
Gove: no apology for UK parliament suspension
AP-APTN-0811: Sweden Nobel Thunberg AP Clients Only 4231660
Climate activist Thunberg wins Alternative Nobel
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.