ETV Bharat / business

తీవ్రమైన ఆర్థిక మందగమనంలో భారత్: ఐఎంఎఫ్​

author img

By

Published : Dec 24, 2019, 12:19 PM IST

Updated : Dec 24, 2019, 4:33 PM IST

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక మందగమనంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. ఐఎంఎఫ్​ ముందుగా అంచనా వేసినదానికంటే ఎక్కువకాలం ఈ మందగమనం ఉన్నట్లు పేర్కొంది. ఆర్థిక రంగానికి పునరుత్తేజం తేవడానికి సత్వరమే విధానపర నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

IMF says India in midst of significant economic slowdown, calls for urgent policy actions
తీవ్రమైన ఆర్థిక మందగమనంలో భారత్: ఐఎంఎఫ్​

తీవ్రమైన ఆర్థిక మందగమనంలో భారత్: ఐఎంఎఫ్​

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రమాద ఘంటికలు మోగించింది. ప్రస్తుతం భారత్ తీవ్రమైన ఆర్థిక మందగమనంలో ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక తిరోగమనానికి పరిష్కారంగా ప్రభుత్వం సత్వరమే విధానపర నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సోమవారం విడుదల చేసిన తన నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థపై పలు విషయాలు ప్రస్తావించింది. ఇటీవలే కాలంలో భారతదేశంలో గణనీయమైన ఆర్థిక వృద్ధి కారణంగా లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డ విషయాన్ని గుర్తుచేసింది. అయితే 2019 ప్రథమార్థంలో పలు కారణాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించిందని స్పష్టం చేసింది.

"ఆర్థిక వృద్ధి మందగించడమే ప్రస్తుతం భారత్​కు సమస్య. ఆర్థిక రంగంలో నెలకొన్న సమస్యల వల్ల ఇంతకుముందు అంచనా వేసినట్లు వెంటనే కోలుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం భారత్ తీవ్రమైన ఆర్థిక మందగమనంలో ఉంది."
-రనిల్ సాల్​గడో, ఇండియా మిషన్​ చీఫ్, ఐఎంఎఫ్​ ఆసియా పసిఫిక్ విభాగం

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి కేవలం 4.5 శాతానికి పరిమితమైంది. ఇది గత ఆరు సంవత్సరాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. బలహీన ఆర్థిక కార్యకలాపాలు డిసెంబర్​లో సైతం కొనసాగే అవకాశం ఉందని పలు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

మెరుగ్గానే ఉంది

ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ పలు విషయాల్లో భారత్ మెరుగ్గా ఉందని రనిల్ తెలిపారు. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

"ఇతర విషయాల్లో భారత్​ మెరుగ్గా రాణిస్తోంది. నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కరెంటు ఖాతా లోటు తగ్గింది. కూరగాయల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ... గత కొద్ది సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. సమస్యల్లా ప్రస్తుత ఆర్థిక వృద్ధి మందగమనానికి పరిష్కారం చూపడమే. ఆర్థిక వృద్ధి మందగమనం మనం అనుకున్నదానికంటే ఎక్కువ కాలం ఉండొచ్చు. కానీ ద్రవ్యోల్బణం, ఇతర అంశాలన్నీ నియంత్రణలోనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు."
-రనిల్ సాల్​గడో, ఇండియా మిషన్​ చీఫ్, ఐఎంఎఫ్​ ఆసియా పసిఫిక్ విభాగం

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక రంగం మెరుగుదలకు తక్షణమే విధానపర చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. భారత ద్రవ్య విధానం ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొన్న ఆయన... వాటిని మెరుగుపరిచే విధానాలు అవలంబించాలని సూచనలు చేశారు.

AP Video Delivery Log - 0300 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0234: Honduras Prison Violence AP Clients Only 4246133
Relatives mourn after deadly Honduran prison riots
AP-APTN-0230: Australia Morrison No access Australia 4246136
Aus PM meets people affected by raging bushfires
AP-APTN-0104: US NY Schumer Must credit WABC-TV; No access New York; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4246134
Schumer demands documents from White House
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Dec 24, 2019, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.