ETV Bharat / business

కరోనా కాలంలోనూ ఐఐటీల్లో నియామకాల జోరు

author img

By

Published : Dec 3, 2020, 5:34 AM IST

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో పలు బహుళ జాతి కంపెనీలు భారీ నియామకాలు చేపట్టాయి. కరోనా కాలంలోనూ విద్యార్థులకు రూ.కోట్లలో వార్షిక వేతనం ఆఫర్​ చేశాయి. అత్యధికంగా ఐఐటీ దిల్లీ విద్యార్థులు 300 ఉద్యోగాలను ఒడసిపట్టుకున్నారు. ఐఐటీ భువనేశ్వర్​ నుంచి 217, ఐఐటీ మద్రాస్ నుంచి 123 మంది విద్యార్థులు భారీ ప్యాకేజీలను అందుకున్నారు.

IITs beat pandemic blues in placement drives with record job offers, high salary packages
కరోనా కాలంలోనూ ఐఐటీల్లో భారీ నియామాకాలు

కరోనా విస్తృతిలోనూ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో కొలువుల జాతర సాగింది. పలు బహుళ జాతి కంపెనీలు ప్రాంగణ నియామాకాల్లో భారీ ప్యాకేజీలు ప్రకటించి మరీ విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకున్నాయి. అత్యధికంగా ఐఐటీ దిల్లీ విద్యార్థులు 300 ఉద్యోగాలను ఒడసిపట్టుకున్నారు. ఐఐటీ-భువనేశ్వర్​ నుంచి 217, ఐఐటీ మద్రాస్ నుంచి 123 మంది విద్యార్థులు భారీ వేతనంతో కూడిన వార్షిక ప్యాకేజీలను అందుకున్నారు.

నియామాకాల్లో కోటీ రూపాయలకు పైగా వార్షిక వేతనం పొందిన విద్యార్థులు ఉన్నట్లు ఐఐటీ దిల్లీ అధికారులు తెలిపారు. ఈసారి నియామక ప్రక్రియ వర్చువల్‌ పద్దతిలో జరిగినట్లు చెప్పారు. ప్రాంగణ నియామకాలు అందించిన సంస్థల్లో గూగుల్‌, మైక్రోసాప్ట్, క్వాల్‌కాం, యాపిల్‌ వంటి బహుళ జాతి సంస్థలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'నాల్గో త్రైమాసికంలో సానుకూల వృద్ధి రేటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.