బంగారానికి ఎందుకంత డిమాండ్​? ధర ఎవరు నిర్ణయిస్తారు?

author img

By

Published : Aug 20, 2021, 1:21 PM IST

Why is gold so special
బంగారానికి ఎందుకంత ప్రత్యేకత ()

బంగారం.. అత్యంత విలువైన లోహాల్లో ఒకటి. కొన్నిసార్లు కరెన్సీకి దీనిని ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు. ప్లాటినం వంటి విలువైన లోహాలు ఉన్నా.. పసిడికి మాత్రమే ఎందుకు ఇంత క్రేజ్? పుత్తడి ధర భారీగా ఎందుకు ఉంటుంది? అనే సందేహాలకు సమధానాలు తెలుసుకుందాం ఇప్పుడు.

భారతీయ సంప్రదాయాల్లో బంగారానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మహిళలు దీనిని నగల రూపంలో అధికంగా ధరిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో బంగారం ఆర్థికంగానూ ఆదుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం తమ వద్ద ఉండేలా చూసుకుంటారు.

ప్రస్తుతం మనుగడలో చాలా విలువైన లోహాలు ఉన్నాయి. అయినప్పటికీ బంగారానికి ఉన్న ప్రత్యేకత మరే ఇతర లోహాలకు లేదు.. అనడంలో సందేహం అక్కర్లేదు. బంగారు నాణేలను.. పూర్వం కరెన్సీగా వాడేవారు. వస్తు క్రయవిక్రయాలకు దీనినే వాడేవారు. ప్రస్తుత పేపర్ కరెన్సీకి కూడా కొంత వరకు బంగారం విలువ ఆధారం.

ఏ దేశ కరెన్సీని ఆ దేశంలోనే వినియోగించాలి. అమెరికా డాలర్​ను పలు ఇతర దేశాల్లోనూ అనుమతిస్తారు. బంగారం విషయంలో అలా కాదు. ఏ దేశమైనా బంగారంతో లావాదేవీలు చేయొచ్చు.

ఎందుకు ఇంత ధర?

బంగారం ధరను ఒక సంస్థ కానీ, ఒక ప్రభుత్వం కానీ నిర్ణయించదు. సాధారణ మార్కెట్​పై ఆధారపడి బంగారం ధర ఉంటుంది.

బంగారం ధర ఎక్కువగా ఉండేందుకు పలు కారణాలు ఉన్నాయి. దీని మైనింగ్ కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంగారం ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా ఖర్చుతో కూడుకున్నది.

సాధారంగా డిమాండ్ పెరిగినా.. ఉత్పత్తి అంతే స్థాయిలో ఉంటే దాని ధర పెరుగుతుంది. పారిశ్రామికీకరణతో బంగారం ప్రాసెసింగ్ సులభమైనప్పటికీ.. బంగారం ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువ అవుతుంది. దీనితో ధర ఎక్కువగా ఉంటుంది.

ఒక స్థాయిలో బంగారం ఉత్పత్తి జరగకపోవచ్చు. దీనితో బంగారం కొనుగోలు చేయాలంటే ఒకరి నుంచి ఒకరికి బదిలీ మాత్రమే కావాలి. దీనితో సాధారణంగానే ధర పెరుగుతుంది.

ప్లాటినం, పెలాడియం కంటే బంగారం ప్రత్యేకం?

ప్లాటినం, పెలాడియం లాంటి లోహలు చాలా విలువైనవి. కానీ వీటికి బంగారానికి ఉన్న పాపులారిటీ లేదు. చాలా కాలం నుంచి ప్రజలకు బంగారం తెలిసిన లోహం. ప్రాచీన కాలంలో కరెన్సీ ఉండేది కాదు. అప్పుడు బంగారం కాయిన్లను కరెన్సీగా వాడేవారు.

పసిడి తుప్పు పట్టదు. అంతేకాకుండా బంగారం నుంచి అలంకరణ, నగలు తదితరాలను తయారు చేయటం మిగతా వాటితో పోలిస్తే కాస్త సులభం.

ప్లాటినం, పెలాడియం కూడా వేరే ఇతర పదార్థాలతో రియాక్షన్ జరపవు. ఇవి తుప్పు పట్టటం కూడా చాలా తక్కువ. కాకుంటే ఇవి చాలా అరుదైన లోహలు. ఆర్థిక వ్యవస్థకు కావాల్సినన్ని కాయిన్లు ఉత్పత్తి చేయటం కష్టం. అందువల్లనే వీటికి అంత ప్రాముఖ్యం లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.