ETV Bharat / business

బ్యాంకులు వడ్డీ రేట్లు ఎలా తగ్గిస్తాయి...?

author img

By

Published : Oct 11, 2019, 11:36 PM IST

రిజర్వు బ్యాంకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది. వినియోగదారులు తీసుకున్న రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. అయితే అన్ని రుణాలపై వడ్డీ రేట్లు తగ్గవు. ఏ విధమైన అప్పులకు వడ్డీ రేట్లు తగ్గుతాయి? వేటికి తగ్గవు? వడ్డీ రేట్ల తగ్గింపు కోసం బ్యాంకు సంప్రదించాలా? ఇందులో బ్యాంకుల పాత్ర ఏంటి?

బ్యాంకులు  వడ్డీ రేట్లు ఎలా తగ్గిస్తాయి...?

బ్యాంకులు ఇచ్చే రుణాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి బాకీ తీరేవరకు ఒకే వడ్డీ రేట్లు ఉండేది. రెండోది వడ్డీ రేట్లు మారుతూ ఉండేది. నిర్ణీత వడ్డీ రేట్ల రుణాలపై రిజర్వు బ్యాంకు నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు. రెండో రకం వాటిపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది.

బ్యాంకులు ఇలా నిర్ణయిస్తాయి...

రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు... ఆ ఫలాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని బ్యాంకులను కోరుతుంది. ఇందులో భాగంగా ఆయా బ్యాంకుల అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఇందులో బ్యాంకులు తప్పకుండా వడ్డీ రేట్లను తగ్గించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ అక్టోబర్ 1 నుంచి రిటైల్, చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలను ఎక్స్​టర్నల్ బెంచ్ మార్కు ద్వారా అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎక్స్​టర్నల్ బెంచ్ మార్కులో ట్రెజరీ బిల్ రేటు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ రేటు, రెపో రేటు వంటివి ఉన్నాయి. బ్యాంకులు వీటి ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయించాల్సి ఉంటుంది. వీటి ద్వారా బ్యాంకు వడ్డీ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు వెంటనే బదిలీ అవుతుంది.

ఇదీ ప్రక్రియ....

ప్రతి బ్యాంకుకు కోర్ బ్యాంకింగ్ బృందాలు లేదా బ్యాంక్ ఎండ్ బృందాలు ఉంటాయి. బ్యాంకులన్నీ డిజిటల్ పద్దతిలో అన్ని లావాదేవీలను నిర్వహిస్తుంటాయి. దానికి అనుగుణంగా సర్వర్లు ఉంటాయి. వీటి ద్వారా బ్యాంకు సెంట్రల్ సర్వర్​లో వడ్డీ రేట్లను మార్పు చేస్తారు. దీంతో అటోమేటిక్​గా వినియోగదారులకు వడ్డీ రేట్లు తగ్గుతాయి.
వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందటానికి వినియోగదారుడు బ్యాంకును సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒక వేళ వడ్డీ రేట్లలో ఏమైనా సందేహాలు ఉండే బ్యాంకు అధికారులను సంప్రదించి నివృత్తం చేసుకోవచ్చు.

బ్యాంకులు వడ్డీ రేట్లు ఎలా తగ్గిస్తాయి...?

ఇదీ చూడండి:చెన్నై విమానాశ్రయంలో జిన్​పింగ్​కు ఘనస్వాగతం

Intro:Body:TG_HYD_65_11_ATTN_ETVBHARAT_HOW_BANKS_REDUCE_INTEREST_RATES_ENGLISH_7202041

The Reserve Bank has recently cut interest rates. The interest rates on loans taken by customers will also fall. However, interest rates on all loans are not reduced. On what types of loans interest rates will come down? Should you Contact Bank for Interest Rate Reduction? What is the role of banks in this process?
There are two types of loans offered by banks. One of those is fixed interest rate loans. The second one is floating interest rate loans. The Reserve Bank's decision has no impact on fixed interest rate loans. Only the latter type has rate reduction effect.
How banks decide interest rates ?
When the Reserve Bank lowers interest rates ... it requests banks to transfer that money to consumers. The decision will be taken by the officials of the respective banks. There was no provision for banks to cut interest rates. But from October 1, banks have been directed to provide loans to retail and small-scale enterprises through an external benchmark.
Treasury Bill Rate, Certificate of Deposit Rate and Repo Rate are called external benchmarks. by this only Banks have to decide on interest rates. Through this, the interest rate reduction benefit is transferred to the customers quickly and automatically.
Is It automatic?
Each bank has core banking teams or bank end teams. Banks handle all transactions digitally. There will be servers accordingly. Banks will change the interest rates on the bank's central server. By this Interest rates for consumers are reduced automatically.
Customers do not need to contact the bank to take advantage of the interest rate reduction. In case of any doubt in interest rates, they can contact bank officials.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.