ETV Bharat / business

పండుగ సీజన్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అదిరే ఆఫర్లు!

author img

By

Published : Oct 6, 2021, 10:50 AM IST

ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ దసరా ఆఫర్లు ప్రకటించింది. ఈ-కామర్స్​, ఇతర బ్రాండ్లతో ఒప్పందాల ద్వారా భారీ క్యాష్​ బ్యాక్​, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

HDFC Bank offers
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్

పండుగల వేళ రుణాలు తీసుకునే వారికి 'ఫెస్టివ్‌ ట్రీట్‌ 3.0' పేరుతో ప్రత్యేక వడ్డీ రేట్లు ఆఫర్‌ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది. ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఈ రాయితీలు అందిస్తున్నామని తెలిపింది. రిటైల్‌ వినియోగదారుల నుంచి, వ్యాపారుల వరకు అందరూ ఈ రాయితీలు పొందవచ్చని వివరించింది.

ఆఫర్లు ఇలా..

  • ప్రీమియం మొబైల్‌ ఫోన్లపై.. నోకాస్ట్​ ఈఎంఐ, క్యాష్​ బ్యాక్​ వంటి ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్.
  • ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలపై 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్​ ఇస్తున్నట్లు బ్యాంక్​ పేర్కొంది. దీనితో పాటు వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం వినియోగించుకోవచ్చని వివరించింది.
  • కారు రుణంపై వడ్డీ రేటును 7.50 శాతం తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. గడువుకు ముందే రుణం పూర్తిగా చెల్లించినా ఎలాంటి అదనపు రుసుములూ ఉండవని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 100 శాతం, ట్రాక్టర్లకు 90% రుణాన్ని అందించనుంది.
  • రూ.75 లక్షల హామీ అవసరం లేని రుణాలను కూడా ఇస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇవన్నీ కలిపి మొత్తం 10 వేలకు పైగా ఆఫర్లు అందిస్తున్నట్లు వివరించింది.

ఇది చదవండి: ఆ ఆఫీసులో వారానికి మూడురోజులే పని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.