ETV Bharat / business

Gold Rate Today: ఏపీ​, తెలంగాణలో పసిడి ధర ఎంతంటే?

author img

By

Published : Oct 22, 2021, 10:06 AM IST

gold price today
ఏపీ​, తెలంగాణలో పసిడి ధర ఎంతంటే?

బంగారం ధర (Gold Rate Today) శుక్రవారం స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.515 తగ్గి రూ.66,655 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,100గా ఉంది. కిలో వెండి ధర రూ.66,655 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,655 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,788 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.22 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇంధన ధరల పెంపు..

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్​కు (Petrol price hike) 35 పైసలు చొప్పున పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర 36 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ రూ.111.14కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు అధికమై.. లీటర్​ రూ.104.28 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 71 పైసలు పెరిగి.. లీటర్​ రూ.112.48కి చేరింది. డీజిల్​పై 74 పైసలు పెరిగి​ లీటర్ రూ.104.99 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.90 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.50కి చేరింది.

ఇదీ చూడండి : పండగ సమయంలో కొలువుల జాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.