ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర-పెరిగిన వెండి

author img

By

Published : Dec 30, 2020, 4:37 PM IST

Gold marginally lower; silver gains
స్వల్పంగా తగ్గిన బంగారం ధర-పెరిగిన వెండి

బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.16 తగ్గింది. అయితే వెండి ధరలో పెరుగుదల నమోదై.. కిలో వెండి రూ. 67,673కు చేరింది.

దేశీయంగా బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.16 తగ్గి.. రూ.49,484కు చేరింది.

అయితే పసిడికి భిన్నంగా వెండి ధర రూ.205 పెరిగి.. రూ.67,673కు ఎగబాకింది.

"అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్​తో పోల్చితే రూపాయి మారక విలువ పెరగడం వల్ల దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి" అని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,879 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి 26.22 డాలర్లుకు చేరింది.

ఇదీ చూడండి: వరుసగా ఆరో రోజు లాభాలు- 14వేలకు చేరువైన నిఫ్టీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.