ETV Bharat / business

కరోనాను తరిమే ట్యాబ్లెట్​ ఇప్పుడు రూ.75/- మాత్రమే!

author img

By

Published : Jul 13, 2020, 2:34 PM IST

కరోనా మహమ్మారిని ఇప్పుడు మరింత తక్కువ ధరకే తరిమేయొచ్చు. తొలిదశ లక్షణాలతో బాధపడే కరోనా రోగుల్లో వైరస్​ను అంతం చేసేందుకు ఉపయోగిస్తున్న ఫాబిప్లూ ఔషధాన్ని ఇప్పుడు 75 రూపాయలకే అందిస్తోంది గ్లెన్​మార్క్​ ఫార్మా. తొలుత అందుబాటులోకి తెచ్చిన ధరపై ఏకంగా 27 శాతం తగ్గించింది.

glenmark-pharma-cuts-price-of-covid-19-drug-by-27-percent-to-rs-75-slash-tablet
కరోనాను తరిమే ట్యాబ్లెట్​ ఇప్పుడు రూ.75/- మాత్రమే!

స్వల్ప లక్షణాలతో బాధపడే కరోనా రోగులకిచ్చే ఫాబిప్లూ ఔషధ ధరలను తగ్గిస్తున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా సంస్థ తెలిపింది. ఒక్కో ట్యాబ్లెట్‌పై 27 శాతం మేర ధర తగ్గిస్తూ.. 75 రూపాయలకే అందించనున్నట్లు పేర్కొంది.

glenmark-pharma-cuts-price-of-covid-19-drug-by-27-percent-to-rs-75-slash-tablet
కరోనాను తరిమే ట్యాబ్లెట్​ ఇప్పుడు రూ.75/- మాత్రమే!

తొలి దశలోని కరోనాకు విరుగుడుగా ఫావిపిరావీర్​ టాబ్లెట్​ను(ఫాబిప్లూ ఔషధం) జూన్​ 20న అందుబాటులోకి తెచ్చింది గ్లెన్‌మార్క్‌. అప్పుడు ఒక్కో ట్యాబ్లెట్‌ ధర 103 రూపాయలు.

అధిక ఉత్పత్తితోనే ధర తగ్గింపు సాధ్యమైందని తెలిపింది గ్లెన్​మార్క్. ఈ నిర్ణయంతో దేశంలోని ఎక్కవ మంది కరోనా రోగులకు తమ ఔషధం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

ఇదీ చదివేయండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.