ETV Bharat / business

రైల్వే మైలురాయి- 6,000 స్టేషన్లలో ఉచిత వైఫై

author img

By

Published : May 16, 2021, 6:51 PM IST

Free WIFI in Railway stations
రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు

రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు మరో మైలురాయిని దాటాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,000 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ సేవలను 2016లో ప్రారంభించింది రైల్వే శాఖ.

భారతీయ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా అందిస్తున్న ఉచిత వైఫై సేవలు ఇప్పటి వరకు 6,000 స్టేషన్లకు విస్తరించాయి. ఝార్ఖండ్‌లోని హజీర్‌బాగ్‌ స్టేషన్‌లో శనివారం ఈ సేవలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఈ మైలురాయిని చేరుకుంది.

ఫ్రీ వైఫై సేవలు తొలిసారి 2016లో ముంబయి రైల్వేస్టేషన్‌లో ప్రారంభమయ్యాయి. అనంతరం దేశంలోని ప్రధాన స్టేషన్లకు ఈ సేవలను విస్తరించారు. బంగాల్‌లోని మిద్నాపూర్‌ ఈ సేవలు పొందిన 5,000వ స్టేషన్​గా నిలిచింది.

పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా అందరికీ వైఫై సేవలు అందించడమే లక్ష్యమని రైల్వే శాఖ తెలిపింది. గూగుల్‌, డీఓటీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, టాటా ట్రస్ట్‌ సహకారంతో రైల్‌టెల్‌ ఉచితంగా ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.

ఇదీ చదవండి:ఎయిర్​టెల్ కొత్త ఆఫర్​- రూ.49 రీఛార్జ్ ఫ్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.