ETV Bharat / business

'మధ్యతరగతి'కి కేంద్రం 'ఆత్మనిర్భర్​' కానుక

author img

By

Published : Nov 12, 2020, 4:21 PM IST

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీతో ముందుకొచ్చింది కేంద్రం. అయితే ఈ 'ఆత్మనిర్భర్​ భారత్​ 3.0'లో మధ్య తరగతి ప్రజలకు భారీగా ఊరటనిచ్చింది. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ప్రోత్సాహకాలు, గృహ నిర్మాణాల కోసం నిబంధనల సడలింపులు ఇచ్చింది.

fm-announces-new-employment-generation-scheme
ఆత్మనిర్భర్​ 3.0లో 'మధ్యతరగతి'కి పెద్ద పీట

దీపావళికి రెండు రోజుల ముందే మధ్యతరగతి ప్రజలకు పండుగ కానుకలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ఊరటనిచ్చే విధంగా 'ఆత్మనిర్భర్​ భారత్​ 3.0'ను బుధవారం ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఉపాధి, ఇళ్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తూ ఉద్దీపన ప్యాకేజీని ఆవిష్కరించారు. ఆ వివరాలు..

ఆత్మనిర్భర్​ భారత్​ రోజ్​గార్​ యోజన..

  • కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా.. 'ఆత్మనిర్భర్​ భారత్​ రోజ్​గార్​ యోజన.'
  • ఈపీఎఫ్​ఐ పరిధిలోని సంస్థ కొత్త ఉద్యోగిని(గతంలో పీఎఫ్​లో చేరనివారు లేదా ఉద్యోగం కోల్పోయిన వారు) చేర్చుకుంటే... సంస్థకు, ఉద్యోగికి పీఎఫ్ కంట్రిబ్యూషన్​లో రాయితీ​. అక్టోబర్​ 1 నుంచి ఈ నిర్ణయం అమలు.
  • రెండేళ్ల పాటు సంస్థ-ఉద్యోగుల కంట్రిబ్యూషన్లు (24శాతం) ఆయా సంస్థలకు అందజేత.
  • ఈపీఎఫ్​ఓలో నమోదు చేసుకున్న సంస్థల్లో రూ. 15వేలు కన్నా తక్కువ జీతానికి చేరిన కొత్త ఉద్యోగికి వర్తింపు.
  • కరోనా వల్ల 2020 మార్చి 1 అనంతరం ఉద్యోగం కోల్పోయి.. 2020 అక్టోబర్​ 1 తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన వారు(రూ. 10వేల కన్నా తక్కువ జీతం) కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారు.
  • నిబంధన:- కనీసం 2 కొత్త ఉద్యోగాలు(50 కన్నా తక్కువ సిబ్బంది ఉన్న సంస్థలు), కనీసం 5 కొత్త ఉద్యోగాలు(సిబ్బంది 50కు పైబడిన సంస్థలు).
  • 2021 జూన్​ 30 వరకు ఈ పథకం అమలు.

పీఎం ఆవాస్​ యోజన..

  • పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్​ యోజనకు అదనంగా రూ.18వేల కోట్లు కేటాయింపు.
  • ఈ నిర్ణయంతో కొత్తగా 12 లక్షల ఇళ్లు నిర్మాణం ప్రారంభం, మరో 18 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి. స్టీల్, సిమెంట్​కు భారీగా పెరగనున్న డిమాండ్.
  • ఈ చర్యలతో అదనంగా 78 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం.
  • కాంట్రాక్టులపై పెర్ఫామెన్స్​ సెక్యూరిటీ 5 నుంచి 3 శాతానికి తగ్గింపు. ఈ నిర్ణయంతో నిర్మాణ, మౌలిక వసతుల అభివృద్ధి రంగంలోని గుత్తేదారులకు ఊరట. టెండర్లకు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టీకరణ. 2021 డిసెంబర్​ 31వరకు ఈ నిర్ణయం వర్తింపు.

ఆదాయపు పన్ను మినహాయింపు..

  • ఇళ్ల నిర్మాణదారులు, కొనుగోలుదారులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్ను మినహాయింపు నిబంధనల్లో మార్పులు.
  • సర్కిల్​ రేట్ల కింద ఉన్న రూ. 2కోట్లు విలువ చేసే ప్రాథమిక నివాస యూనిట్ల అమ్మకాల్లో ఆదాయపు పన్నుపై సండలింపులు.
  • సర్కిల్​ రేటు- ఒప్పంద విలువ మధ్య ఉన్న 10శాతం వ్యత్యాసాన్ని 20శాతానికి పెంపు.
  • ఈ సడలింపులు 2021 జూన్​ 30 వరకు అమల్లో ఉంటాయి.

ఇదీ చూడండి:- 'కరోనా టీకా అభివృద్ధి కోసం రూ. 900కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.