ETV Bharat / business

ఆ సీనియర్ సిటిజన్లకు రిటర్నుల నుంచి విముక్తి

author img

By

Published : Feb 1, 2021, 1:06 PM IST

Updated : Feb 1, 2021, 5:26 PM IST

exemption-from-filing-their-it-return-for-senior-citizens-who-are-75-years-of-age-and-above
సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్నుల నుంచి విముక్తి

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈసారి బడ్జెట్‌లో విత్త మంత్రి ఊరట కలిగించలేదు. శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే ఫించను, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఐటీ రిటర్న్‌ దాఖలు నుంచి మినహాయింపునిచ్చారు. ఆదాయపు పన్ను విలువ కట్టే కేసుల తిరిగి తెరిచే కాల పరిమితిని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు కుదించారు. మరోవైపు, డిజిటల్ మాధ్యమం ద్వారా కార్యకలాపాలు సాగించే రూ. 10 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్ను ఆడిట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఆదాయపు పన్ను చెల్లింపు దారులను కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐటీ శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే కేవలం ఫించను, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్న్‌ దాఖలుకు వీరికి మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులే వారి తరఫున పన్ను మినహాయించుకుంటాయి.

"75 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న సీనియర్‌ సిటీజన్లకు ఐటీ రిటర్న్‌ల దాఖలు నుంచి మినహాయింపునిస్తున్నాం. కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఉన్న వారికి ఐటీ రిటర్న్‌ దాఖలు నుంచి మినహాయింపు కల్పిస్తున్నాం. చిన్నమొత్తాల పన్నుచెల్లింపుదారుల వివాదాల పరిష్కారం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రూ.50లక్షలలోపు ఆదాయం ఉండి.. రూ.10లక్షల లోపు వివాదంలో ఉన్న ఆదాయం కలిగిన వాళ్లు నేరుగా కమిటీకి అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం."

-నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

హైలైట్స్

IT return for senior citizens who are 75 years
హైలైట్స్

ఆడిట్ మినహాయింపు

మరోవైపు, అధిక భాగం కార్యకలాపాలు డిజిటల్ మాధ్యమం ద్వారా సాగించే కంపెనీలకు పన్ను ఆడిట్ మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటివరకు ఐదు కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకే ఇటువంటి మినహాయింపు లభిస్తుండగా.. దాన్ని రెట్టింపు(రూ.10కోట్లు) చేశారు.

ఆదాయ పన్ను లెక్కింపు కేసులను తిరిగి ప్రారంభించే పరిమితిని మూడేళ్లకు తగ్గించారు నిర్మల. ఇదివరకు ఈ కేసులను తిరిగి దర్యాప్తు చేసే కాలపరిమితి ఆరేళ్లుగా ఉండేది. 50 లక్షల రూపాయలకు పైబడిన కేసులకు మాత్రం ఈ కాల పరిమితి పదేళ్లుగా ఉంది.

ఇదీ చదవండి: 'బీమా సంస్థల్లో 74శాతానికి ఎఫ్​డీఐలు'

Last Updated :Feb 1, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.