ETV Bharat / business

భారత్​లో ఇక విద్యుత్​ వాహనాలదే హవా!

author img

By

Published : Feb 13, 2022, 4:43 AM IST

d
ఎలక్ట్రానిక్​ కార్స్

EV Cars in India: దేశంలో విద్యుత్​, హైబ్రిడ్​ వాహనాలకు క్రమంగా డిమాండ్​ పెరుగుతోందని డెలాయిట్​ సంస్థ వెల్లడించింది. నిర్వహణ వ్యయం తక్కువ కావడం, వాతావరణ పరిరక్షణపై ఆలోచన, మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతి వంటి కారణాలతో విద్యుత్‌ వాహనాలకు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది.

EV Cars in India: భారత్‌లో వాహన ధోరణులు క్రమంగా మారుతున్నాయని, ఎక్కువ శాతం మంది వినియోగదారులు విద్యుత్‌, హైబ్రిడ్‌ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారని డెలాయిట్‌ అధ్యయనం వెల్లడించింది. మూడొంతులకు పైగా భారత వినియోగదారులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని పేర్కొంది. పర్యావరణహితమైన, దేశీయ తయారీ వాహనాలపై భారత్‌ దృష్టి పెట్టడం ఇందుకు కలిసొస్తుందని తెలిపింది. డెలాయిట్‌ 'గ్లోబల్‌ ఆటోమోటివ్‌ కన్జూమర్‌ స్టడీ 2022' పేరిట అధ్యయనాన్ని వెలువరించింది.

వాతావరణ మార్పులు, కాలుష్య స్థాయులు, గ్యాసోలిన్‌/డీజిల్‌ వాహన ఉద్గారాలు వంటి ఆంశాలను 59 శాతం మంది వినియోగదారులు పట్టించుకుంటున్నారని పేర్కొంది. నిర్వహణ వ్యయం తక్కువ కావడం, వాతావరణ పరిరక్షణపై ఆలోచన, మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతి వంటి కారణాలతో విద్యుత్‌ వాహనాలకు మొగ్గుచూపుతున్నట్లు వివరించింది. 2021 సెప్టెంబరు-అక్టోబరులో నిర్వహించిన ఈ సర్వేలో 25 దేశాలకు చెందిన 26000 మందికి పైగా వినియోగదారులు పాల్గొన్నారు.

  • బడ్జెట్‌లో పర్యావరణహిత వాహనాలకు తోడ్పాటు ఇచ్చేందుకు బ్యాటరీ స్వాపింగ్‌, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాల కల్పనకు నిర్ణయాలు తీసుకోవడం సానుకూల ప్రభావం చూపనుంది.
  • వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్తున్న కొత్త మార్పులతో భారత వాహన పరిశ్రమ వృద్ధి దిశగా దూసుకెళ్తోందని, తాజా అధ్యయనంలో విద్యుత్‌ వాహనాల పట్ల వినియోగదారులు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమైందని డెలాయిట్‌ ఇండియా పార్టనర్‌, ఆటోమోటివ్‌ లీడర్‌ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు.
  • యువత (మిలీనియల్స్‌), జెన్‌జడ్‌ తరం అవసరాల కోసం సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత మోడళ్లకు గిరాకీ కనిపిస్తోంది. నిర్వహణ సమాచారం కోసం వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు భారత వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు.
  • 70 శాతం మంది సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఒకే బ్రాండ్‌కు చెందిన పలు మోడళ్లను వినియోగించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. 72 శాతం మంది వివిధ బ్రాండ్‌లను, 69 శాతం మంది ప్రీ-ఓన్డ్‌ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు.

ఇదీ చూడండి : అనిల్​ అంబానీకి సెబీ షాక్.. నిధుల సమీకరణపై నిషేధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.