ETV Bharat / business

ఈ కామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో 30వేల ఉద్యోగాలు

author img

By

Published : Sep 13, 2020, 10:34 PM IST

ప్రముఖ లాజిస్టిక్స్​ సంస్థ ఈ కామ్​ ఎక్స్​ప్రెస్​ నిరుద్యోగులకు తీపికబురునందించింది. పండగ సీజన్​ను దృష్టిలో ఉంచుకొని తమ కంపెనీలో త్వరలోనే భారీస్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ కామర్స్​కు డిమాండ్​ పెరిగిన నేపథ్యంలోనే.. ఆ సంస్థ ఇలా తాత్కాలిక నియామక భర్తీకి యోచిస్తోంది.

Ecom Express to create 30000 temporary jobs ahead of festive sales
ఈ కామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో 30వేల ఉద్యోగాలు

ప్రముఖ లాజిస్టిక్స్‌ సంస్థ ఈ కామ్‌ ఎక్స్‌ప్రెస్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పండగ సీజన్‌ సందర్భంగా భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. సీజన్‌లో సంస్థ కార్యకలాపాల కోసం దాదాపు 30వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకానికి యోచిస్తున్నట్లు వెల్లడించింది.

డిమాండ్​ పెరిగినందుకే..

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ కామర్స్‌ రంగానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. దీంతో కిరాణ, మెడిసిన్‌, ఇతర వస్తువులను కూడా ఆన్‌లైన్‌లో కొనేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో గత నెలలోనే 7500 మందిని నియామకం చేసుకున్న సంస్థ.. తాజాగా ఇప్పుడు రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ 30వేల తాత్కాలిక సిబ్బంది నియామకానికి సిద్ధమైంది.

ఈ సందర్భంగా సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ దీప్‌ మాట్లాడుతూ.. 'కరోనా వైరస్‌ ఈ కామర్స్‌ పరిశ్రమను ఊహించని విధంగా మార్పు చేసింది. పండగ సీజన్‌లో వినియోగదారులు భారీ స్థాయిలో షాపింగ్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి వారి డిమాండ్‌కు అనుగుణంగా పనిచేయాలని ఆశిస్తున్నాం. అందులో భాగంగానే తాత్కాలిక ఉద్యోగుల నియామకం ప్రారంభించాం. అక్టోబర్‌ 10 వరకు ఇది కొనసాగుతుంది. అవసరానికి అనుగుణంగా దాదాపు 30వేల మందిని నియామకం చేసుకోవాలని యోచిస్తున్నాం. తమ సంస్థ కేవలం మెట్రో, టైర్‌ 1 నగరాలే కాకుండా టైర్‌ 2 ప్రాంతాల్లోనూ సిబ్బంది నియామకం జరుపుతోంది. ఈ నియామకాలన్నీ తాత్కాలిక సిబ్బంది కోసమే అని.. ఎంపికైన వారందరికీ పని ఆధారంగా శిక్షణ ఉంటుంది' అని తెలిపారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ దెబ్బకు 2.1 కోట్ల వేతన ఉద్యోగాల్లో కోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.