ETV Bharat / business

వాట్సాప్​లో మన డీపీని ఎవరు చూశారో తెలుసుకోవచ్చా?

author img

By

Published : Oct 24, 2021, 8:21 PM IST

whatsapp dp viewers checking possible
వాట్సాప్​లో డీపీని ఎవరు చూశారో తెలుసుకోవచ్చా?

వాట్సాప్‌ స్టేటస్‌ను ఎవరు చూశారనేది తెలుస్తుంది కానీ వాట్సాప్‌ డీపీ లేదా ప్రొఫైల్ ఫొటో ఎవరు చూశారనేది మనకు మాత్రం తెలియదు. అయితే.. కొన్ని థర్డ్​పార్టీ యాప్​ల సాయంతో మన డీపీ చూసిన వివరాలు తెలుసుకోవచ్చనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. మరి.. ఈ వార్తల్లో నిజమెంత?

వాట్సాప్‌లో మనం పెట్టుకున్న ప్రొఫైల్ ఫొటో లేదా డిస్‌ప్లే పిక్చర్‌ (డీపీ)ను ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ డీపీని చూసిన వారి వివరాలు థర్డ్‌పార్టీ యాప్స్‌ ద్వారా తెలుసుకోవచ్చనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఇది సాధ్యమేనా?..నిజంగా వాట్సాప్‌ ప్రొఫైల్ ఫొటో ఎవరు చూశారనేది తెలుసకోవచ్చా?

వాట్సాప్‌ డీపీని చూసిన వారి వివరాలు తెలుసుకునేందుకు ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి Who Viewed My WhatsApp Profile, Whats Track, Whatbox వంటి యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని యాప్‌ డెవలపర్స్ సూచిస్తున్నారు. యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫొటో లేదా డీపీని ఎవరెవరు చూశారనేది సదరు యాప్‌లో నిక్షిప్తం అవుతుందని చెబుతున్నారు.

తాజాగా దీనిపై సైబర్ నిపుణులు స్పందించారు. వాట్సాప్‌లో ప్రొఫైల్‌ ఫొటో లేదా డీపీ ఎవరు చూశారనేది తెలుసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అలాంటి వార్తలను ఎంత మాత్రం నమ్మొద్దని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి యాప్‌ల సాయంతో యూజర్ల డేటాను దొంగలిస్తున్నట్లు తెలిపారు. యూజర్‌ ప్రైవసీకి సంబంధించిన వాట్సాప్‌ కఠినమైన నిబంధనలు అమలు చేస్తోందని.. వాటిని మీరి థర్డ్‌పార్టీ యాప్‌లు యూజర్‌ డేటాను ట్రాక్‌ చేయలేవని వెల్లడించారు. పైన పేర్కొన్న యాప్‌లలో చూపించే జాబితా మొత్తం మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లోని పేర్లను ఒక ప్రణాళిక ప్రకారం చేసే మోసమని తెలిపారు. ఒకవేళ మీ ఫోన్లలో ఇలాంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయాలని సూచించారు.

త్వరలోనే ఆ ఫీచర్..

కొద్ది రోజుల క్రితం వాట్సాప్ కొత్తగా ప్రొఫైల్‌ ఫొటోకు సంబంధించిన ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ సాయంతో మీ ప్రొఫైల్ ఫొటోను ఎవరెవరు చూడాలనేది మీరే నియంత్రించుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: కొత్త ఫీచర్లతో వాట్సాప్​.. ఇవి తెలుసుకోండి..

ఇదీ చూడండి:- నయా వాట్సాప్ స్కామ్​.. గిఫ్ట్​ పేరుతో ఖాతా లూటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.