బూస్టర్ డోసుగా కొవిషీల్డ్​.. అనుమతులు కోరిన సీరం!

author img

By

Published : Dec 1, 2021, 7:49 PM IST

Covishield as booster dose

Covishield as booster dose: కొవిషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా అందించేందుకు అనుమతులు ఇవ్వాలని డీసీజీఐని సీరం ఇన్​స్టిట్యూట్ కోరింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. ఒమిక్రాన్ భయాలతో పాటు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నందున.. దీనిపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది.

Booster dose in india: కొవిషీల్డ్​ను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు అనుమతులు ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)ను సీరం ఇన్​స్టిట్యూట్ కోరింది. దేశంలో సరిపడా కొవిషీల్ట్ నిల్వలు ఉన్నాయని, దీంతో పాటు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నందున బూస్టర్ డోసుగా ఈ టీకాను ఉపయోగించాలని అభ్యర్థించింది. ఈ మేరకు సంస్థ రెగ్యులేటరీ అఫైర్స్​ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్.. డీసీజీఐకి దరఖాస్తు చేశారని అధికార వర్గాలు తెలిపాయి.

ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన ఈ టీకాను బూస్టర్ డోసుగా వినియోగించేందుకు యూకే వైద్య నియంత్రణ సంస్థ ఇప్పటికే అనుమతులు జారీ చేసిందని దరఖాస్తులో సీరం ఇన్​స్టిట్యూట్ పేర్కొంది.

"ప్రపంచంలో మహమ్మారి పరిస్థితి తీవ్రంగానే ఉంది. చాలా దేశాలు బూస్టర్ డోసు పంపిణీని ప్రారంభించాయి. మన దేశంలోని పౌరులతో పాటు విదేశాల్లో కొవిషీల్డ్ తీసుకున్నవారంతా బూస్టర్ డోసు కావాలని అడుగుతున్నారు. దేశంలో కొవిషీల్డ్​ టీకాలకు కొరత లేదు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఈ సమయంలో.. బూస్టర్ డోసు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి."

-సీరం లేఖ

Centre on Booster dose

బూస్టర్ డోసు విషయమై నిపుణుల బృందం చర్చలు జరుపుతోందని కేంద్రం ఇదివరకే పార్లమెంట్​కు తెలిపింది. బూస్టర్ డోసు ఉపయోగంపై శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తోందని వెల్లడించింది. బూస్టర్ డోసుపై కేంద్రం వైఖరి ఏంటో చెప్పాలని నవంబర్ 25న దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రెండో వేవ్ లాంటి పరిస్థితిని తాము చూడాలనుకోవడం లేదని పేర్కొంది.

అటు పలు రాష్ట్రాలు సైతం బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్​గఢ్ రాష్ట్రాలు ఈ విషయమై కేంద్రాన్ని సంప్రదించాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.