ETV Bharat / business

మోడెర్నాతో సిప్లా రూ.7వేల కోట్ల ఒప్పందం!

author img

By

Published : May 31, 2021, 10:39 PM IST

మోడెర్నా సింగిల్​ డోస్​ టీకాను భారత్​లోకి వేగంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా తెలిపింది. 1 బిలియన్​ డాలర్లు(రూ.7,250 కోట్లు) విలువైన ఒప్పందానికి అతి చేరువలో ఉన్నట్లు పేర్కొంది. అయితే.. ఇందుకు ప్రభుత్వ సాహకారం కావాలని కోరింది.

Cipla, Moderna
మోడెర్నా, సిప్లా

మోడెర్నా(Moderna) సింగిల్​ డోస్​ కొవిడ్​-19 బూస్టర్​ వ్యాక్సిన్​ను భారత్​లోకి తీసుకొచ్చేందుకు అనుమతులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా(Cipla). ధరల పరిమితి, ట్రయల్స్​, కస్టమ్స్​ డ్యూటీ, నష్టపరిహారం వంటి వాటి నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా సంస్థతో 1 బిలియన్​ డాలర్ల ఒప్పందానికి చేరువలో ఉన్నట్లు పేర్కొంది.

"కొవిడ్​-19 నుంచి ప్రజలను రక్షించేందుకు దేశంలో వ్యాక్సిన్ల లభ్యతను పెంచేలా ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. కొవిడ్​ బూస్టర్​ వ్యాక్సిన్​పై మోడెర్నాతో చర్చలు ఖరారయ్యే దశలో ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ భాగస్వామ్యం, మద్దతు అవసరం. ధరల పరిమితి, ట్రయల్స్​, కస్టమ్స్​ డ్యూటీ, నష్టపరిహారం వంటి నాలుగు కీలక అంశాల్లో మినహాయింపునిచ్చేలా కేంద్రం భరోసా ఇవ్వాలి. ఆ హామీతో సుమారు రూ.7,250 కోట్ల(1బిలియన్​ డాలర్లు) విలువైన ఒప్పందానికి మరింత బలం చేకూరుతుంది."

- సిప్లా ఫార్మా సంస్థ

భారత మార్కెట్లో తమ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​ను తీసుకొచ్చేందుకు మోడెర్నా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సిప్లాతో పాటు ఇతర భారతీయ సంస్థలతో ఇటీవల చర్చలు జరిపింది. సిప్లాతో ఒప్పందం కుదిరితే 2022లో సుమారు 50మిలియన్​ మోడెర్నా టీకా డోసులు భారత్​లో అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చూడండి: 'మా టీకా పిల్లలపై పనిచేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.