ETV Bharat / business

బ్యాంక్ ఉద్యోగుల రెండు రోజుల సమ్మె.. ఈ తేదీల్లో...

author img

By

Published : Dec 1, 2021, 7:27 PM IST

bank strike news
బ్యాంకులు స్ట్రైక్

Bank Strike News: బ్యాంకుల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యోగా సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. డిసెంబర్​ 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) తెలిపింది.

Bank Strike News: రెండు బ్యాంక్​ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) ప్రకటించింది. మొత్తంగా తొమ్మిది యూనియన్లతో కూడిన ఉండే ఈ ఫోరం డిసెంబర్ 16 నుంచి రెండు రోజుల స్ట్రైక్​ చేయాలని నిర్ణయించింది.

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్​బీ)ను ప్రైవేటీకిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా తాము ఈ సమ్మె చేపడుతున్నట్లు పేర్కొంది యూఎఫ్​బీయూ.

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 2019లో ఐడీబీఐ బ్యాంక్​లోని మెజార్టీ వాటాను ఎల్​ఐసీకి విక్రయించింది. ఇలా నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదింపచేయడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని యూఎఫ్‌బీయూ నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్​ వెంకటాచలం తెలిపారు. ఈ మేరకు డిసెంబర్​ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ​ బ్యాంకులను నిర్వీర్యం చేసేలా ఉందని ఆయన అన్నారు.

ఇదీ చూడండి: మారిన బ్యాంక్​ రూల్స్​.. కొత్త నిబంధనలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.