ETV Bharat / business

అమెజాన్ ప్రైమ్​ డే సేల్ షెడ్యూల్, ఆఫర్స్ ఇవే...

author img

By

Published : Jul 23, 2020, 4:47 PM IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రైమ్​ డే సేల్ ప్రకటించింది. వచ్చే నెల 6,7 తేదీల్లో రెండు రోజుల పాటు సేల్ నిర్వహిస్తోంది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

AMAZON LATEST OFFERS
అమెజాన్ ప్రైమ్​డే సేల్

కరోనా కాలంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్​ డే సేల్ ప్రకటించింది. ఆగస్టు 6, 7 తేదీల్లో సేల్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

కరోనా వల్ల కొనేవాళ్లు లేక చిన్న వ్యాపారులు, చేతి వృత్తి కళాకారులు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఈ సారి సేల్​లో ప్రాధాన్యమిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. చిన్న వ్యాపారుల నుంచి కొనే ఉత్పత్తులపై అదనపు డిస్కౌంట్లు కూడా ఇవ్వనున్నట్లు​ పేర్కొంది.

amazon prime day sale
అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​

ఆఫర్లు, ఉత్పత్తులు..

ప్రైమ్​ డే సేల్​లో 300లకుపైగా కొత్త ఉత్పత్తులు విక్రయానికి రానున్నాయని అమెజాన్ తెలిపింది.

స్మార్ట్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, టీవీలు, ఫ్రిజ్​లు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి. ఇతర నిత్యవసరాలపై కూడా భారీ తగ్గింపు ఉండనుంది.

అమెజాన్​ పే నుంచి చెల్లింపులు చేసే వారికి రూ.2 వేల వరకు క్యాష్ బ్యాక్ రానుంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డులతో లావాదేవీలు జరిపే వారికి ప్రైమ్​ డే ఆఫర్​తో పాటు అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.

ఇదీ చూడండి:వర్క్​ ఫ్రం హోంకే 74% ఉద్యోగులు మొగ్గు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.