ETV Bharat / business

క్యూ3లో రూ.లక్ష కోట్లు దాటిన కార్పొరేట్​ పన్ను వసూళ్లు

author img

By

Published : Dec 17, 2020, 9:50 PM IST

Advance corporate tax
కార్పొరేట్​ పన్ను వసూళ్లు

కార్పొరేట్ల ముందస్తు పన్ను వసూళ్లు మూడో త్రైమాసికంలో 49శాతం పెరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. ఇది ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందనడానికి సూచికగా పేర్కొంది. క్యూ3లో మొత్తం రూ.1,09,506కోట్ల ముందస్తు పన్నులు వసూలైనట్లు తెలిపింది.

కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని పేర్కొంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. అందుకు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కార్పొరేట్ల ముందస్తు పన్ను​ చెల్లింపుల్లో 49 శాతం వృద్ధి నమోదవటమే సూచికగా పేర్కొంది. క్యూ3లో కార్పొరేట్ల అడ్వాన్స్​ టాక్స్​లు రూ.1,09,506 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వం కార్పొరేట్​ పన్నును రికార్డు స్థాయిలో 25 శాతానికి తగ్గించిన క్రమంలో ఈ మేరకు వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి పన్ను వసూళ్లు రూ.73.126 కోట్లు మాత్రమేనని తెలిపింది.

స్థూల ప్రత్యక్ష పన్నుల్లోనూ వృద్ధి..

కార్పొరేట్​ ముందస్తు పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పుంజుకోవటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7,33,715 కోట్లకు చేరుకున్నాయి. అది గత ఏడాది ఇదే సమయంతో ( రూ.8, 34,398 కోట్లు) పోలిస్తే.. 12.1 శాతం మాత్రమే తగ్గాయని పేర్కొంది.

మూడో త్రైమాసికంలో ఆదాయపన్ను శాఖ రూ.1,46,109 కోట్ల పన్ను రీఫండ్​ చేసింది. అది గత ఏడాదితో పోలిస్తే 8.1 శాతం తక్కువ. తొలి మూడు త్రైమాసికాల్లో కార్పొరేట్ల అడ్వాన్స్​​ పన్ను వసూళ్లు రూ.2,39,125 కోట్లుగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 4.9 శాతం తక్కువ. కరోనా మహమ్మారి ప్రభావంతో భారీగా తగ్గాయి.

వ్యక్తిగతంలో తుస్స్​..

వ్యక్తిగత ముందస్తు ఆదాయ పన్ను చెల్లింపులు 5.6 శాతం క్షీణతతో రూ.31, 054 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సమయానికి రూ. 32,910కోట్లగా ఉంది.

నాలుగు విభాగాలుగా..

కార్పొరేట్‌ కంపెనీలు, వ్యక్తులు ఆర్థిక సంవత్సరం మొత్తానికి చెల్లించాల్సిన పన్ను బకాయిల్లో 15 శాతం తొలి త్రైమాసికంలో, రెండు, మూడు త్రైమాసికాల్లో 25 శాతం చొప్పున, మిగతా 35 శాతాన్ని నాలుగో త్రైమాసికంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: పన్ను తగ్గింపుతో... వాహనరంగానికి కొత్త ఉత్సాహం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.