ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు... 98 పేజీలతో హైకోర్టు తీర్పు

author img

By

Published : Dec 28, 2022, 6:15 PM IST

Updated : Dec 28, 2022, 7:28 PM IST

MLA baiting case 98page judgment
ఎమ్మెల్యేలకు ఎర కేసు... 98 పేజీలతో హైకోర్టు తీర్పు

18:11 December 28

ఎమ్మెల్యేలకు ఎర కేసు... 98 పేజీలతో హైకోర్టు తీర్పు

మొయినాబాద్‌ ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారనే ఉదంతంపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తు జరిపే బాధ్యతను సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ చేయడానికి గల కారణాలు వివరిస్తూ 98 పేజీలతో కూడిన తీర్పును హైకోర్టు విడుదల చేసింది. జడ్జిమెంట్‌లో న్యాయమూర్తి పలు కీలక విషయాలు ప్రస్తావించారు.

‘‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పే. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్‌ విఫలమైంది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేత తీవ్ర అభ్యంతరకరం. విచారణ అధికారుల వద్ద ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియా, ప్రజల వద్దకు వెళ్లిపోయాయి. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయి. సిట్‌ చేసిన దర్యాప్తు పారదర్శకంగా అనిపించలేదు. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు. ఆర్టికల్‌ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చు. దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలంటూ భాజపా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హం కాదు. నిందితులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి.. ఎఫ్ఐఆర్‌ 455/2022 సీబీఐకి బదిలీ చేస్తున్నాం’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

భారాస ఎమ్మెల్యేలకు ఎర వేశారంటూ పోలీసులు నమోదుచేసిన కేసులో సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డితోపాటు నిందితులు రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, కోరె నందకుమార్‌ అలియాస్‌ నందు, సింహయాజి, న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌, కేరళకు చెందిన తుషార్‌ వెల్లపల్లిలు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం తీర్పు వెలువరించగా.. తీర్పు ప్రతులు ఇవాళ విడుదలయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated :Dec 28, 2022, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.