ETV Bharat / state

Chairpersons appointed to Corporations : పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్

author img

By

Published : Dec 17, 2021, 10:23 AM IST

Updated : Dec 17, 2021, 12:08 PM IST

CM KCR news, chaiman to corporations
పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్

10:19 December 17

తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్

Chairpersons appointed to Corporations : రాష్ట్రంలో మరో ఐదు కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియామకం అయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఆర్థికసంస్థ ఛైర్​పర్సన్​గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించారు. బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్​గా సీనియర్ నేత గజ్జెల నగేష్... రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ ఛైర్మన్​గా పాటిమీది జగన్మోహన్ రావుకు బాధ్యతలు అప్పగించారు. సాహిత్య అకాడమీ ఛైర్మన్​గా రచయిత జూలూరి గౌరీశంకర్​... షీప్‌ అండ్‌ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్​గా విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్​ను నియమించారు. ఛైర్మన్ల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను రెండు రోజుల క్రితమే నియమించారు. తాజాగా మరో ఐదుగురిని నియమించారు.

ఛైర్మన్ల వివరాలు..

కాంగ్రెస్​లో ఎమ్మెల్సీగా గెలిచిన ఆకుల లలిత తదుపరి పరిణామాల్లో తెరాసలో చేరారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా... ఆమెకు మరో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో లలితను రాష్ట్ర మహిళా ఆర్థికసంస్థ ఛైర్​పర్సన్​గా నియమించారు. సీనియర్ నేత గజ్జెల నగేష్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. 2014లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనను బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్​గా నియమించారు.

టికెట్ ఆశించి.. కార్పొరేషన్లకు..

కేటీఆర్ అనుచరుడిగా ఉన్న పాటిమీది జగన్మోహన్ రావు తెరాస సోషల్ మీడియా విభాగం బాధ్యతలు చూస్తున్నారు. ఆయనకు టీఎస్టీఎస్ ఛైర్మన్​గా బాధ్యతలు అప్పగించారు. రచయిత జూలూరి గౌరీశంకర్ బీసీ కమిషన్ సభ్యునిగా పనిచేశారు. ఆయనను సాహిత్య అకాడమీ ఛైర్మన్​గా నియమించారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఇటీవల నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా టికెట్ ఆశించారు. తాజా పరిణామాల్లో బాలరాజు యాదవ్​ను గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్​గా నియమించారు.

ఇదీ చదవండి: Priest Rangarajan on Akhanda: ‘అఖండ’పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి కామెంట్స్

Last Updated : Dec 17, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.