ETV Bharat / sitara

Priest Rangarajan on Akhanda: ‘అఖండ’పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి కామెంట్స్

author img

By

Published : Dec 17, 2021, 10:44 AM IST

Priest Rangarajan on Akhanda, priest rangarajan
లుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి కామెంట్స్

Priest Rangarajan on Akhanda : అఖండ సినిమాపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతోందోనని ప్రత్యక్షంగా చూపించారని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అన్నారు.

లుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి కామెంట్స్

Priest Rangarajan on Akhanda : ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ సినిమాపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. గత వారం తాను, తన సేవక బృందంతో కలిసి ‘అఖండ’ చూసినట్లు చెప్పారు. అప్పుడే ఈ సినిమా గురించి చెప్పాలనుకున్నా గానీ, కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయానన్నారు. ఈ మేరకు సినిమాపై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతోందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం మనందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. ‘అహింసా ప్రథమో ధర్మః’ అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సినిమాలో చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చనే సిద్ధాంతాన్ని స్పష్టంగా సినిమాలో చూపించారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకు ఈ సినిమాను అందరూ చూస్తున్నారంటే.. వారి మనసుల్లో ఉక్రోషం.. ఆక్రోషం.. తపన ఉంది. ఏమీ చేయలేకపోతున్నామనే బాధ ఉంది. ఆందోళనకరమైనటువంటి కోపం ఉంది. రాజ్యాంగం ఉంది. అయినా మన ధర్మానికి అన్యాయం జరుగుతోంది. రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసమే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది పాలకులు గుర్తించాలి’’ అని తన అభిప్రాయాన్ని వీడియో సందేశంలో వివరించారు.

బోయపాటి దర్శకత్వంలో నిర్మితమైన అఖండ సినిమాను నేను, మా బృందంతో కలిసి పోయిన వారం చూశాను. పోయినవారమే ఆ సినిమా గురించి భక్తులకు చెప్పాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. ఇవాళ ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యక్షంగా అందులో చూపించారు. ఇంతమంది చూస్తున్నారంటే వారి మనసుల్లో మన ధర్మానికి అన్యాయం జరుగుతోందని ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. రాజ్యంగాన్ని సవరించకపోయినా... దాని బేసిక్ స్ట్రక్చర్ మార్చకుండా అలాగే ఉంచితే చాలు.

-రంగరాజన్, లుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు

ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'పుష్ప'.. ఎందుకంత స్పెషల్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.