ETV Bharat / bharat

యూట్యూబ్ ద్వారా కేంద్ర మంత్రికి భారీగా ఆదాయం

author img

By

Published : Sep 17, 2021, 3:24 PM IST

Updated : Sep 17, 2021, 5:00 PM IST

YouTube now pays me Rs 4 lakhs per month: Union Minister Nitin Gadkari
యూట్యూబ్ ద్వారా కేంద్ర మంత్రికి భారీగా ఆదాయం

కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ(Nitin Gadkari News) ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. యూట్యూబ్ ద్వారా తను భారీ ఆదాయాన్ని సమాకూర్చుకుంటున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో నేర్చుకున్న రెండు విషయాల్లో ఇదీ ఒకటని చెప్పారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari News) తన సంపాదన గురించి కీలక విషయాన్ని వెల్లడించారు. యూట్యూబ్​ తనకు నెలకు రూ.లక్షలు చెల్లిస్తున్నట్లు(Nitin Gadkari Youtube) వెల్లడించారు. కరోనా సమయంలో తాను రెండే విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఒకటి వంట చేయడం, రెండు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా లెక్చర్లు ఇవ్వడమని వివరించారు. తన యూట్యూబ్ ఛానల్​లో(Nitin Gadkari Youtube Channel) పోస్ట్​ చేస్తున్న ఈ వీడియో సందేశాలకు విశేష ఆదరణ లభించడం వల్ల నెలకు రూ.4లక్షలకుపైగా ఆదాయం సమకూరుతున్నట్లు చెప్పారు.

'కరోనా సమయంలో నేను షెఫ్​గా మారాను. ఎన్నో వంటలు చేశాను. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 950 లెక్చర్లు ఇచ్చాను. విదేశీ యూనివర్సిటీల విద్యార్థులకూ క్లాసులు చెప్పాను. వీటిని యూట్యూబ్​లో అప్లోడ్​ చేశాను. నా ఛానల్​కు వ్యూస్ భారీగా వచ్చాయి. దీంతో యూట్యూబ్​ నెలకు రూ.4లక్షలు రాయల్టీగా చెల్లిస్తోంది' అని గడ్కరీ అన్నారు.

దిల్లీ-ముంబయి ఎక్స్​ప్రెస్​వే(DME) పనులను సమీక్షించిన సందర్భంగా రత్లాంలో గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు గడ్కరీ(Nitin Gadkari Expressway). దిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్​ను కలిపే ఈ రహదారి నిర్మాణ పనులు పురోగతిని సమీక్షించారు. మధ్యప్రదేశ్​లో 245కిలోమీటర్లకు గానూ 106కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు.

" DME ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్​ప్రెస్​వే. 1350కి.మీ మేర ఉన్న ఈ రహదారితో ప్రజలు ముంబయి నుంచి దిల్లీకి 12 నుంచి 12.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్టు అయిన జవహర్​లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు-ఎన్​హవా శేవ వద్ద ముగుస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్​లోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలను కలుపుకొంటూ ఈ రహదారి ఉంటుంది. 2023నాటికి నిర్మాణం పూర్తవుతుంది. దీని వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా రూ.1300కోట్లు కేటాయించి సంరక్షణ చర్యలు తీసుకున్నాం. మొదటగా 8 లైన్ల రోడ్డు నిర్మిస్తున్నాం. తర్వాత రద్దీని బట్టి 12 లైన్లకు విస్తరిస్తాం.​"

- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి.

ఈ రహదారి మార్గంలో పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, సీఎన్​జీ పంప్​ స్టేషన్లు, ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను కూడా నిర్మిస్తున్నట్లు గడ్కరీ వివరించారు. దీని కోసం 670 హెక్టార్ల భూమిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. దేశాభివృద్ధిలో రోడ్డు రవాణా చాలా కీలకమని పేర్కొన్నారు.

గడ్కరీ(Union Minister Nitin Gadkari News) ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెబుతారని పేరుంది. అందుకు తగ్గట్టు గానే ఆయన భారత్​లో బాగా పనిచేసేవారికి ప్రశంసలు దక్కవని ఈ సందర్భంగా అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరని గడ్కరీ (Nitin Gadkari Latest News) చెప్పుకొచ్చారు. మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్యే, సీఎం పీఠం దక్కలేదని మంత్రులు అసంతృప్తిగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాజపా తరచూ సీఎంలు మార్చుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపైనా పరోక్షంగా ఛలోక్తి విసిరారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్​లో మళ్లీ రికార్డ్​.. మధ్యాహ్నం వరకే కోటి డోసుల పంపిణీ

Last Updated :Sep 17, 2021, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.