ETV Bharat / bharat

అత్యాచారం కేసులో అరెస్ట్​.. 'జైలు' భయంతో 'బల్లి' మింగేసిన నిందితుడు.. చివరకు..

author img

By

Published : Jul 10, 2023, 8:17 PM IST

రిమాండ్​లో ఉన్న ఓ నిందితుడు తనను పోలీసులు జైలుకు పంపుతారనే భయంతో ఏకంగా బల్లినే మింగేశాడు. తర్వాత ఏమైందంటే?

Youth Ate Lizard In UP Kanpur District
జైల్లో వేస్తారనే భయంతో బల్లిని మింగిన నిందితుడు.. చివరకు..

అత్యాచారం కేసులో నిందితుడిగా అరెస్టై పోలీసుల రిమాండ్​లో ఉన్న ఓ నిందితుడు తనను జైల్లో ఉంచుతారనే భయంతో ఏకంగా బల్లినే మింగేశాడు. ఈ విచిత్ర సంఘటన కాన్పూర్​ జిల్లాలోని కాన్పూర్​ పరిధిలో జరిగింది. నిందితుడు బల్లిని మింగటాన్ని చూసిన పోలీసు సిబ్బంది ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. వెంటనే అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
కాన్పూర్​ నగరం సాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికను మల్లవాని ఏరియాకు చెందిన మహేశ్​ అనే యువకుడు బలవంతంగా అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. అనంతరం అతడిని అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు. అయితే మహేశ్​ను కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించాల్సి ఉంది.

Youth Ate Lizard In UP Kanpur
బల్లిని మింగిన నిందితుడు మహేశ్​ (నల్ల టీ-షర్టు వేసుకున్న వ్యక్తి)

ఈ క్రమంలో న్యాయపరమైన పనులు జరుగుతున్న సమయంలోనే మహేశ్​ భయంతో పోలీస్​ స్టేషన్​లోనే ఇలా బల్లిని మింగి అందరిని షాక్​కు గురి చేశాడని పోలీసులు తెలిపారు. ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని భిటార్‌గావ్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లుగా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ శుక్లా చెప్పారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

"అత్యాచారం కేసులో పోలీసులు నన్ను అరెస్టు చేసి సద్​ పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరిచాక నన్ను జైల్లో వేస్తారనే భయంతోనే బల్లిని నోట్లో వేసుకొని మింగాను"

- మహేశ్​, నిందితుడు

"బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడు మహేశ్​ను అరెస్టు చేసి స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించాం. ఆదివారం అర్ధరాత్రి అతడు ఒక్కసారిగా బల్లిని మింగాడు. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాం. అనంతరం అతడిని సోమవారం మళ్లీ జైలుకు తీసుకువచ్చాం"

- విజయ్​ శుక్లా, స్టేషన్​ ఇన్​ఛార్జ్​

ఆమెనే స్వయంగా..
మరోవైపు నిందితుడు మహేశ్​.. కేసు పెట్టిన యువతి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లి గడిపిందని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఈ విషయం బయటకు రావడం వల్ల బాధిత యువతి కావాలనే మహేశ్​పై కేసు పెట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సెల్​ఫోన్​ మింగిన ఖైదీ..
కొద్దినెలల క్రితం అచ్చం ఇదే తరహా ఘటన బిహార్​లోని గోపాల్​గంజ్ జిల్లా జైలులో వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ పోలీస్​​ స్టేషన్​లో ఉన్న ఖైదీ ఏకంగా సెల్​ఫోన్​నే మింగేశాడు. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయి ఆస్పత్రి పాలయ్యాడు. మరి చివరకు అతడికి ఏమైందో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.