ETV Bharat / bharat

Rape: నమ్మి వెంట వెళ్లిన యువకుడిపై అత్యాచారం

author img

By

Published : Oct 11, 2021, 10:47 AM IST

ఓ యువకుడిపై మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బైక్​పై డ్రాప్ చేస్తానని బాధితుడిని నమ్మించిన నిందితుడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి, అతనిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

man raped by a man
మగాడిపై మగాడి అత్యాచారం

కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు ఆడ, మగా, చిన్నాపెద్ద అని తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి దారుణ ఘటనే ఇది. ఓ పురుషుడిపై మరో పురుషుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే?

బెళగావి జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు.. హోటల్​లో క్లీనర్​గా పని చేస్తున్నాడు. రోజులానే అతడు అక్టోబరు 5న తన పని పూర్తయ్యాక.. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో.. అథణి తాలుకాలోని సంకొనట్టి గ్రామానికి చెందిన రాజు అచారకట్టి అక్కడికి బైక్​పై వచ్చాడు.

రాజు ఆ యువకుడిని 'తన బైక్​పై డ్రాప్​ చేస్తాను రమ్మని' పిలిచాడు. దాంతో రాజు మాటలను నమ్మిన బాధితుడు.. బైక్​పై ఎక్కాడు. అయితే.. బాధితుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితుడు.. అక్కడ అతనిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.

దీనిపై అథణి పోలీస్​ స్టేషన్​లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్టు చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.