ETV Bharat / bharat

కశ్మీర్​లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన

author img

By

Published : Aug 13, 2022, 4:06 PM IST

Updated : Aug 13, 2022, 5:18 PM IST

World highest railway bridge అందమైన కశ్మీర్‌ లోయలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జితో పర్యాటకంగా హిమాలయ కొండలు మరింత సుందరంగా మారనున్నాయి. ఈ నిర్మాణంతో కశ్మీర్‌ లోయకు అనుసంధానం మరింత సులభం కానుంది. ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తైన ఈ వంతెన విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

world highest railway bridge
చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం

చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం

World highest railway bridge ప్రకృతి సోయగాలకు జమ్ముకశ్మీర్ పెట్టింది పేరు. ఇక్కడి వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ లోయలోకే మరో అద్భుతం చేరింది. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది. కత్రా-బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలుస్తోంది. ఈ వంతెనను గోల్డెన్‌ జాయింట్‌గా పిలుస్తున్నారు. ఈ వంతెన చివరల నుంచి ఒక విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం.. బ్రిడ్జి మధ్యలో కలుసుకుంటుంది. మేఘాలపై వంతెన నిర్మించినట్లు కనిపిస్తున్న ఫొటోను రైల్వేశాఖ ట్విట్టర్​లో షేర్​ చేసింది.

world highest railway bridge
చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం

చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. ఈ వంతెన పొడవు 13,15 మీటర్లు కాగా.. ఈ నిర్మాణానికి దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశారు. బలమైన గాలులతో పాటు, భూకంపాలను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి బ‌రువు బరువు 10,619 మెగా టన్నులు అని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. ఈ బ్రిడ్జి మొత్తం 7 పిల్లర్లను కలిగి ఉండగా సంగల్‌దాన్ వద్ద ఉన్న పిల్లర్ అన్నింటికన్నా ఎత్తులో 103 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జి ఈఫిల్‌ టవర్‌ కన్నా 35 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీన్ని ఆఫ్కాన్స్‌ సంస్థ నిర్మించింది. 2004లో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇప్పుడు పూర్తయింది. కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తైన ఈ నిర్మాణం.. బంగీ జంపింగ్‌ లాంటి సాహసోపేతమైన క్రీడలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ వంతెన పర్యాటకంగా జమ్ముకశ్మీర్‌ను మరింత ఉన్నత స్థితిలో ఉంచుతుందని తెలిపారు.

world highest railway bridge
చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం

ప్రస్తుతం కశ్మీర్ నుంచి దిల్లీకి సరకు రవాణా ట్రక్కులకు 48 గంటల సమయం పడుతుండగా ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో రవాణా ఖర్చు తగ్గి కశ్మీరీ సరకులు చౌకగా లభిస్తాయని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: హోటల్​కు పిలిచి మహిళపై అత్యాచారం చేసిన వ్యాపారి

సతీమణితో కలిసి జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా

Last Updated : Aug 13, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.