ETV Bharat / bharat

హెడ్​మాస్టర్ పాడు బుద్ధి..​ వాట్సాప్​లో అసభ్య మెసేజ్​లు.. చంపేస్తానంటూ...

author img

By

Published : Mar 11, 2022, 5:54 PM IST

Women Harassment: ఒడిశాలోని ఓ హెడ్​మాస్టర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. ఓ బాలికకు అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు పాల్పడటమే అందుకు కారణం. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

headmaster
హెడ్​మాస్టర్​

Women Harassment: అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ ఓ బాలికను వేధించాడు ఆ స్కూల్​ హెడ్​మాస్టర్​. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

గత కొంతకాలంగా పాఠశాలకు వచ్చే బాధితురాలికి వాట్సాప్​ సహా పలు సోషల్​మీడియా యాప్స్​ ద్వారా నిందితుడు అసభ్యకర మెసేజ్​లు పంపించి వేధిస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే.. ఆమెను స్కూల్​ నుంచి తొలగించడమే కాక చంపేస్తానని బెదిరించేవాడు. కానీ ఎట్టకేలకు బాధితురాలు ఆ స్కూల్​లోని ఓ మహిళా టీచర్​కు ఈ విషయాన్ని చెప్పింది. టీచర్​ సాయంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: బాలికపై సామూహిక అత్యాచారం- వీడియో చిత్రీకరించి బెదిరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.