ETV Bharat / bharat

''కుడి చేయి నరికేస్తే ఏంటి? ఎడమ చేయి ఉందిగా!'.. ఆ నర్స్​ తెగువకు సలాం'

author img

By

Published : Jun 8, 2022, 9:17 AM IST

Updated : Jun 8, 2022, 9:37 AM IST

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఎగిరి గెంతేయాల్సింది పోయి.. తిరిగి ఆమె కుడి చేయిని నరికేశాడు ఓ కిరాతక భర్త. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మాత్రం తన లక్ష్యాన్ని విడువలేదు. ఎడుమ చేతితో రాయడం ప్రాక్టీస్ చేస్తుంది. అసలేం జరిగిందంటే?

Woman whose right wrist was cut off, starts writing with his left hand
Woman whose right wrist was cut off, starts writing with his left hand

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని భర్త చేయి నరికేసిన దారుణ ఘటన బంగాల్​లో జరిగింది. రక్తపుమడుగులో వచ్చిన ఆమెకు ప్రస్తుతం దుర్గాపుర్​ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కుడి చేయి లేదని నిరాశ చెందని బాధితురాలు ప్రస్తుతం ఎడమ చేతితో రాయడం ప్రాక్టీస్​ చేస్తుంది. ఆరునూరైనా తన లక్ష్యాన్ని విడిచిపెట్టనని చెబుతోంది. బాధితురాలు ఆసుపత్రిలో ఎడమ చేతితో ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మహిళా కమిషన్ చీఫ్ లీనా గంగోపాధ్యాయ ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఆమె నర్సుగా తన వృత్తిని కొనసాగించలేకపోతే వేరే ఉద్యోగం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కమిషన్ చీఫ్ హామీ ఇచ్చారు.

Woman whose right wrist was cut off, starts writing with his left hand
ఎడమ చేత్తో రాయడం ప్రాక్టీస్​ చేస్తున్న బాధితురాలు

ఇదీ జరిగింది.. బంగాల్​లోని తూర్పు బుర్ద్వాన్​ జిల్లా కోజల్సా గ్రామంలో షేర్​ మహమ్మద్, రేణు ఖాతున్​ భార్యాభర్తలు నివసిస్తున్నారు. రేణు.. దుర్గాపుర్​లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్​లో నర్సింగ్ శిక్షణ తీసుకుండేది. ఈ మధ్యే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాసై ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం చేయడానికి నిందితుడు షేర్​ మహమ్మద్ అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వివాదాలు తలెత్తాయి. ఆ సమయంలోనే భార్యపై కోపంతో పదునైన ఆయుధంతో ఆమె కుడి చేయిని నరికేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని ఆసుపత్రిగా తరలించగా వైద్యులు ఆమె చేయిని తొలగించి వైద్యం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలి అత్త, మామలను అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడు పరారీలోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు.

Woman whose right wrist was cut off, starts writing with his left hand
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

ఇవీ చదవండి: నుపుర్‌ శర్మకు కంగన మద్దతు.. ఇది అఫ్గానిస్థాన్ కాదంటూ...

వైకోమ్ సత్యాగ్రహం.. అరుదైన ఉద్యమం.. దిగొచ్చిన రాజకుటుంబం

Last Updated :Jun 8, 2022, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.