ETV Bharat / bharat

మహిళపై స్కూల్​ బస్​​ డ్రైవర్ అత్యాచారం... బీమా డబ్బుల కోసం భార్య హత్య

author img

By

Published : Dec 1, 2022, 11:27 AM IST

Updated : Dec 1, 2022, 11:39 AM IST

school bus driver raped women
మహిళపై స్కూల్​ బస్​​ డ్రైవర్ అత్యాచారం

ఓ మహిళపై ప్రైవేట్ స్కూల్​ బస్ డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఆమెపై అఘాయిత్యం చేసి పారిపోయాడు. మరోవైపు, బీమా డబ్బుల కోసం భార్యను చంపించాడు ఓ భర్త. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

ఓ ప్రైవేట్ స్కూల్​ బస్​ డ్రైవర్..​ మహిళపై అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. బస్​లోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డ డ్రైవర్ అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఆ సమయంలో బస్ ఫోటో తీసిన మహిళ.. ఘటన గురించి కొడుకుకు తెలియజేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు​లోని చంద్ర లేఅవుట్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Woman raped by school bus driver
నిందితుడు శివకుమార్

నిందితున్ని శివకుమార్​గా గుర్తించారు. నిందితుడు ఈ మధ్యనే​ ఓ ప్రైవేట్ పాఠశాల బస్ డ్రైవర్​గా పనిలో చేరాడు. మంగళవారం సాయంత్రం ఎప్పటిలాగే విద్యార్థులను బస్​లో వారి ఇంటి వద్ద దింపేశాడు శివకుమార్. అనంతరం నాయండహల్లి వైపుగా వెళ్తుండగా ఓ మహిళ లిప్ట్​ అడిగి బస్సులో ఎక్కింది. కొంత దూరం పోనిచ్చిన తరువాత నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఘటనపై ఆ మహిళ కొడుకుతో కలిసి పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేసింది. నిందితుడు శివకుమార్​పై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశామని పోలీసులు తెలిపారు.

బీమా డబ్బుల కోసం భార్య హత్య..
రూ 1.90 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపించాడు ఓ భర్త. అక్టోబర్ 5న భార్యను గుడికి వెళ్లమని కోరిన భర్త.. ఆమె మోటార్​ సైకిల్​పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టించి చంపాడు. ప్రమాదంలో ఆమె కజిన్ తీవ్రంగా గాయపడగా బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ జైపుర్​లో ఈ ఘటన జరిగింది.​

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్ చాంద్​ తన భార్య షాలుపై 40 సంవత్సరాలకు బీమా చేయించాడు. ఆమెను చంపితే ఆ డబ్బును సంపాదించవచ్చని కుట్ర పన్నాడు. అందుకు ఓ రౌడీని పురమాయించాడు. రూ.10 లక్షలు సుపారీ మాట్లాడుకుని రూ.5.5 లక్షలను చెల్లించాడు. ఆమెను హత్య చేయించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాడు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశామని తెలిపిన పోలీసులు.. తమ విచారణలో అసలు విషయం బయటపడిందని చెప్పారు. ఇది హత్యే అని తేల్చినట్లు వివరించారు. చాంద్​, షాలులకు ఇద్దరు సంతానం ఉండగా, వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని పోలీసులు పేర్కొన్నారు. గతంలో షాలు.. చాంద్​పై గృహహింస కేసు సైతం పెట్టిందని వారు వెల్లడించారు.

Last Updated :Dec 1, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.