ETV Bharat / bharat

తదుపరి త్రిదళాధిపతిగా ఆర్మీ చీఫ్ జనరల్​ నరవాణె?

author img

By

Published : Dec 8, 2021, 11:00 PM IST

Next chief of Defense staff: తొలి చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో దుర్మరణం చెందటం యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకు దేశం మొత్తం నివాళులర్పించింది. మరోవైపు.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది.

Army chief Gen Naravane
ఆర్మీ చీఫ్ జనరల్​ ఎంఎం​ నరవాణె

Next chief of Defense staff: తమిళనాడు కూనూర్​లో బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్​ ప్రమాదం జరిగి భారత తొలి త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్​​ దుర్మరణం చెందారు. ఈ క్రమంలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న తెరపైకి వచ్చింది. తదుపరి సీడీఎస్​గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారని చర్చ మొదలైంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేస్తే ప్రస్తుత సైన్యాధిపతి జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవాణెకు త్రిదళాధిపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్మీ చీఫ్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నుంచి 2019, డిసెంబర్​ 31న బాధ్యతలు స్వీకరించారు నరవాణె. 2022, ఏప్రిల్​ వరకు ఆయన పదవీకాలం ఉంది. అయితే, సీడీఎస్​గా నియామకమైతే ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంటుంది. ఆయనకు 65 ఏళ్లు వచ్చే వరకు లేదా కనీసం మూడేళ్లు సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్మీ, నేవీ, వాయు సేనల సమన్వయకర్తగా సీడీఎస్​ విధులు నిర్వర్తిస్తుంటారు. ఆర్మీలో అత్యంత సీనియర్​ అయిన బిపిన్​ రావత్​ బాధ్యతలు చేపట్టిన పరిస్థితులను పరిశీలిస్తే.. సైన్యంలోని సీనియర్​ అధికారినే సీడీఎస్​గా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు.. మూడు దళాల అధినేతలకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లగా నిర్ణయించారు. అయితే.. సీడీఎస్​కు గరిష్ఠ వయోపరిమితిని విధించలేదు.

వారికి అవకాశం తక్కువే!

ప్రస్తుతం నౌకాదళ అధినేత అడ్మిరల్​ ఆర్​ హరి కుమార్​ ఆ బాధ్యతలు నవంబర్​ 30నే స్వీకరించారు. కేవలం 8 రోజులు మాత్రమే అవుతోంది. అలాగే, వాయుసేన చీఫ్​ మార్షల్​ వివేక్​ రామ్​ చౌదరి సెప్టెంబర్​ 30న బాధ్యతలు తీసుకున్నారు. కేవలం రెండు నెలలు పూర్తయ్యాయి.

ఒకవేళ సీడీఎస్​గా నరవాణె బాధ్యతలు స్వీకరిస్తే.. ఆయన స్థానాన్ని నార్తర్న్​ ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ యోగేష్​ కుమార్​ జోషి లేదా ఆర్మీ వైస్​ చీఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ చండీ ప్రసాద్​ మొహంతి భర్తీ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. లెఫ్టినెంట్​ జనరల్​ జోషి.. వాయు, నేవీ చీఫ్​ల కంటే సీనియర్​ కావటం గమనార్హం.

ఇదీ చూడండి: చాపర్ క్రాష్​లో​ సీడీఎస్​ రావత్​ దుర్మరణం

Army chopper crash: ఆర్మీ హెలికాప్టర్​ క్రాష్​ లైవ్ వీడియో!

సీడీఎస్​ రావత్ హెలికాప్టర్​ క్రాష్​- ప్రమాద స్థలంలో భయానక దృశ్యాలు

యుద్ధవీరుడు, త్రిదళాధిపతి.. అసలెవరీ బిపిన్​ రావత్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.