ETV Bharat / bharat

'వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతోనే కాంగ్రెస్ జట్టు'

author img

By

Published : Sep 5, 2021, 1:51 PM IST

will-ally-only-with-small-parties-for-uttar-pradesh-polls-congs-state-chief
'వచ్చే ఎన్నికలకు చిన్న పార్టీలతోనే కాంగ్రెస్ జట్టు'

వచ్చే ఏడాది జరిగే ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్​ కుమార్ లల్లు స్పష్టం చేశారు. కేవలం చిన్న పార్టీలతోనే జట్టు కడతామని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీలతో జట్టు కట్టబోమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్​ కుమార్ లల్లు స్పష్టం చేశారు. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని వెల్లడించారు. సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కూటమిగా బరిలోకి దిగాలనే ఆలోచన కూడా తమకు లేదని పేర్కొన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తెలిపారు.

గత 32 ఏళ్లుగా యూపీలో ఎస్పీ, బీఎస్పీ, భాజపానే ఆధికారంలో ఉన్నాయని, ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చడంలో ఆయా ప్రభుత్వాలు విఫలమయ్యాయని అజయ్ కుమార్ ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

" భాజపాకు కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి అని యూపీ ప్రజలు భావిస్తున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా నాయకత్వంలో మా పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది. చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలోనే పొత్తు ఉంటుంది. ప్రధాన పోటీ భాజపా, ఎస్పీ మధ్యే ఉంటుందనే చర్చ మీడియా సృష్టి మాత్రమే.".

--అజయ్ కుమార్ లల్లు, యూపీ కాంగ్రెస్ చీఫ్​.

కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ ప్రకటించాయి. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మాయావతి చెప్పారు. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని అఖిలేశ్ యాదవ్ తెలిపారు.

ఇదీ చదవండి: Rss Taliban: 'ఆరెస్సెస్​ కార్యకర్తలు, తాలిబన్లు ఒకటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.