ETV Bharat / bharat

యువతికి 'కృత్రిమ' పునరుత్పత్తి అవయవాలు.. దానివల్లే..!

author img

By

Published : May 26, 2022, 5:46 AM IST

Artificial Reproductive Organs Operation: బంగాల్​లోని డైమండ్ హార్బర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. బంగ్లాదేశ్​కు చెందిన ఓ యువతికి శస్త్రచికిత్స ద్వారా పునరుత్పత్తి అవయవాలను కృత్రిమంగా సృష్టించి కొత్త జీవితాన్ని ఇచ్చారు.

Artificial Reproductive Organs Operation:
West Bengal doctors create 'artificial' reproductive organs; gives new lease of life to woman

Artificial Reproductive Organs Operation: బంగాల్​లో ఉన్న డైమండ్‌ హార్బర్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతమయ్యారు. బంగ్లాదేశ్‌కు చెందిన యువతికి కృత్రిమ పునరుత్పత్తి అవయవాలను.. శస్త్రచికిత్స ద్వారా వైద్యులు సృష్టించారు.

ఇదీ జరిగింది: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతికి పుట్టుకతోనే పునరుత్పత్తి అవయవాలు లేవు. జన్యుపరమైన కారణాలతో మాత్రమే ఆ యువతి మహిళగా ఎదుగుతోంది. అయితే ఇటీవలే ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. వరుడి కుటుంబసభ్యులు శస్త్రచికిత్స చేయించుకోవడానికి అనుమతినిచ్చారు. ఏడాది క్రితం ఈ తరహా సర్జరీకి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో యువతి కుటుంబ సభ్యులు చూశారు. ఆ వీడియో ఆధారంగా 15 రోజుల క్రితం డైమండ్​ హార్బర్​ ఆస్పత్రికి వచ్చింది యువతి. ఆమెను పరిశీలించిన వైద్యులు ఆపరేషన్​ చేయాలని నిర్ణయించారు. మే15న శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆ యువతి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని ఫోన్‌లో తెలిపింది ఆ యువతి. ఆసుపత్రి వైద్యులు, నర్సులు అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. త్వరలోనే చెకప్​కు రానున్నట్లు వెల్లడించింది.

"మా మెడికల్ కాలేజీలో గతంలోనూ ఇలాంటి సర్జరీలు జరిగాయి. ఈ సర్జరీలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటిన్నంటిని ఎదుర్కొని మేమంతా విజయవంతమయ్యాం" అని డాక్టర్​ మానస్ సాహా తెలిపారు. "దేశంలో అత్యుత్తమ వైద్య కేంద్రాల్లో ఒకటిగా డైమండ్​ హార్బర్​ వైద్య కళాశాల నిలుస్తోంది. డాక్టర్లు, నర్సులతో పాటు అందరి సమష్టి కృషి వల్లే ఈ ఆపరేషన్​లో విజయం సాధించాం" అని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఉత్పల్ ధామ్ అన్నారు.

అసలేంటీ​ ఈ వ్యాధి?.. వైద్య శాస్త్రంలో ఈ వ్యాధిని 'ముల్లెరియన్ అజెనెసిస్' అని అంటారు. ఈ వ్యాధి సోకితే పునురుత్పత్తి అవయవాలు పుట్టినప్పటి నుంచి ఏర్పడవు. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది మహిళలు ఈ వ్యాధితో జన్మిస్తారు. ఈ వ్యాధిని నయం చేసే శస్త్రచికిత్సను వైద్య పరిభాష 'వాజినోప్లాస్టీ' అంటారు.

ఇవీ చదవండి: వైకల్యంపై ఒంటికాలి పోరాటం... పదేళ్ల బాలిక సంకల్పం భేష్!

లక్కీ మహిళ.. గనిలో బయటపడిన వజ్రం.. ఒక్కసారిగా లక్షాధికారి...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.