ETV Bharat / bharat

స్కూల్​లో టాయిలెట్​ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి

author img

By

Published : Dec 17, 2021, 2:07 PM IST

Wall collapse Tamil Nadu: పురాతన పాఠశాలలోని ముత్రశాల గోడ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తమిళనాడు తిరునెల్వేలిలో జరిగింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

wall collapse
కూలిపోయిన పాఠశాల మూత్రశాల గోడ

Wall collapse Tamil Nadu: తమిళనాడు తిరునెల్వేలిలోని ఓ పురాతన పాఠశాలలో ఘోర ప్రమాదం జరిగింది. మూత్రశాల గోడ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

తిరునెల్వేలి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​కు సమీపంలోని స్కాఫ్టర్​ ఉన్నత పాఠశాల అత్యంత పురాతనమైంది. శుక్రవారం ఉదయం.. పాఠశాలలోని మూత్రశాల గోడ కూలిపోయింది. అక్కడే ఉన్న ముగ్గురు 8వ తరగతి విద్యార్థులపై శిథిలాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

wall collapse
కూలిపోయిన పాఠశాలలోని మూత్రశాల గోడ

సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న పాఠశాలలో భవనాలు, గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు.

తమిళిసై సంతాపం..

విద్యార్థుల మృతిపట్ల సంతాపం తెలిపారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

ఇదీ చూడండి: భార్య నిత్యలక్ష్మి.. భర్త 'నిత్య' పెళ్లి కొడుకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.