ETV Bharat / bharat

'యువతకు 50వేల ఉద్యోగాలు .. రైతులకు కనీస మద్దతు ధర'

author img

By

Published : Feb 9, 2022, 7:50 PM IST

uttarakhand cm
ఉత్తరాఖండ్, పంజాబ్ పోల్స్

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్ ఎన్నికల వేళ.. రాష్ట్రంలోని ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు రాష్ట్ర సీఎం పుష్కర్​సింగ్ ధామి. రాష్ట్రంలో లవ్​జిహాద్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని అన్నారు. యువతకు 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. పంజాబ్​లోని రైతులకు కనీస మద్దతు ధర అందజేస్తామని, రుణమాఫీ చేస్తామని భాజపా కూటమి తన రెండో మేనిఫెస్టోలో ప్రకటించింది.

Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించారు రాష్ట్ర సీఎం పుష్కర్​సింగ్ ధామి. 'లవ్ జిహాద్' చట్టాన్ని సవరించి 10ఏళ్లు కఠిన కారాగార శిక్షను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని యువతకు 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఉత్తరాఖండ్​ను ఆత్మనిర్భరత, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేస్తామని హామీ ఇచ్చారు.

రుణ మాఫీ, కనీస మద్దతు ధర అమలు..

Punjab assembly elections 2022: పంజాబ్​లో రెండో మేనిఫెస్టోను సంయుక్తంగా విడుదల చేశాయి భాజాపా, కూటమి పార్టీలు. రైతులకు రుణమాఫీతోపాటు వ్యవసాయ బడ్జెట్​లో రూ. 5వేలకోట్లు కేటాయిస్తామన్నాయి. ఈ మేనిఫెస్టోను కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్​ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్​) నేత దిండ్సా, పంజాబ్​ లోక్​ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్​ అమరిందర్​ సింగ్​ పాల్గొన్నారు.

మేనిఫెస్టోలోని కీలకాంశాలు:

BJP Punjab manifesto

  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నూనె గింజలను ఉత్పత్తి చేసే రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) అందిస్తాం.
  • వ్యవసాయం అభివృద్ధికోసం వ్యవసాయ బడ్జెట్​లో రూ. 5వేల కోట్లు కేటాయింపు
  • ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులకు రుణ మాఫీ
  • భూమిలేని రైతులకు లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు అందజేత
  • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఏడాదికి రూ. 6వేలు ఆర్థికసాయం
  • ప్రతి పంచాయతీలో ఆరోగ్య కేంద్రాలు
  • విద్యుత్తు వినియోగదారులకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం
  • డిజిటల్ ఇండియా పథకం ద్వారా గ్రామాల్లో డిజిటల్ సేవలు
  • ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, దివ్యాంగులకు 10వ తరగతి వరకు వార్షిక స్టైఫండ్ అందజేత

పంజాబ్​లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇవీ చూడండి: ​

పోలింగ్​ ముంగిట.. పార్టీల 'నినాదాల పోరు'

చన్నీనే సీఎం అభ్యర్థి.. సిద్ధూ ఊరుకుంటారా మరి?

టికెట్ల వేటలో నేతల వలసలు- వేడెక్కిన పంజాబ్‌ రాజకీయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.