ఒకే పాఠశాలలో 69మందికి కరోనా.. లక్షణాలు లేకుండానే!

author img

By

Published : Dec 5, 2021, 7:13 PM IST

Updated : Dec 5, 2021, 9:32 PM IST

karnataka corona
కర్ణాటకలో విద్యార్థులకు పాజిటివ్‌ ()

karnataka schools corona cases: చిక్కమంగళూరు రెసిడెన్షియల్ పాఠశాలలో 69 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఇక్కడ మొత్తం 70 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.పాఠశాలలోని బోధన, బోధనేతర సిబ్బందిలో మొత్తం 457 శాంపిల్స్‌ పరీక్షించారు.

corona positive students in karnataka: కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్‌గా నిర్వహిస్తున్న కొవిడ్‌ పరీక్షల్లో పెద్దఎత్తున కేసులు బయటపడుతున్నాయి. తాజాగా చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 69 మందికి మహమ్మారి సోకినట్లు తేలింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన వారిలో 59మంది విద్యార్థులు, 10 మంది స్టాఫ్​ ఉన్నారు. అయితే కరోనా సోకిన వారిలో ఎవరికి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.

corona in nursing college: మరోవైపు.. శివమొగ్గలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా వెల్లడైంది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ కేబీ శివకుమార్‌ తెలిపారు. దీంతో ఈ ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించి, హాస్టళ్లను మూసివేసినట్లు అధికారులు చెప్పారు. పరిసరాల్లో ఎవరికైనా వ్యాప్తి చెందిందా నిర్ధారించేందుకుగానూ.. స్థానికుల నమూనాలనూ పరీక్షిస్తున్నట్లు చెప్పారు.

cm basavaraj bommai on corona: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి.. ఒకే చోట మూడు, అంతకంటే ఎక్కువ కేసులు వెలుగుచూసిన ప్రాంతాన్ని క్లస్టర్‌గా పరిగణిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొదటి రెండు ఒమిక్రాన్‌ కేసులు కర్ణాటకలోనే బయటపడిన నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 5, 2021, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.