ETV Bharat / bharat

'ఆ కుటుంబ పార్టీలకు ముస్లిం మహిళల కష్టాలు పట్టవా?'

author img

By

Published : Feb 23, 2022, 9:54 PM IST

up election 2022
up election 2022

UP Election 2022: ఉత్తరప్రదేశ్​లో ఐదో దశ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కుటుంబ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బాధపడుతూ.. ముస్లిం మహిళల కష్టాల గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మరోవైపు నాలుగో దశ ఎన్నికల నాటికే.. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి డబుల్ సెంచరీ సీట్లను సాధిస్తుందని అఖిలేశ్​ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

UP Election 2022 Modi: ఉత్తరప్రదేశ్‌లోని కుటుంబ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బాధపడుతూ ముస్లిం మహిళల కష్టాల గురించి పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. యూపీలోని బారాబంకీ, అయోధ్యలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. కరోనా సమయంలో కేంద్రం అందజేసిన ఉచిత రేషన్‌ సహా పలు సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన పేద ప్రజలు భాజపా విజయ పతకాన్ని చేత బూనితే విపక్షాలు బాధపడుతున్నాయని అన్నారు.

మహిళల భద్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యం అని ప్రధాని తెలిపారు. సైన్యం, పారామిలటరీ దళాల్లో ఉత్తరప్రదేశ్‌ మహిళలను పెద్ద ఎత్తున నియమించినట్లు వెల్లడించారు. భద్రతా బలగాల్లో మహిళలు పెద్ద ఎత్తున చేరుతూ దేశానికి రక్షణ కల్పిస్తున్నారని మోదీ అన్నారు. ముస్లిం మహిళలకు ముమ్మారు తలాక్‌ అనే తప్పుడు సంప్రదాయం నుంచి తమ ప్రభుత్వం విముక్తి కల్పించిందని ప్రధాని తెలిపారు.

"ముమ్మారు తలాక్‌ లాంటి తప్పుడు సంప్రదాయాలు ముస్లిం మహిళలను, వారి కుటుంబం మొత్తాన్ని సురక్షితంగా ఉండకుండా చేశాయి. తమ కుటుంబం గురించి ఇంతగా ప్రస్తావిస్తూ ముస్లిం మహిళల బాధ గురించి ఎందుకు ఆలోచించలేదని నేను కుటుంబ పార్టీని అడగాలని భావిస్తున్నాను. ముస్లిం మహిళలు చిన్న చిన్న పిల్లలను తీసుకుని పుట్టింటికి రావాల్సి వచ్చేది. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా కుటుంబ పార్టీలకు ముస్లిం మహిళల కొండంత కష్టాలను చూడడానికి కూడా తీరిక ఉండేది కాదు."

- ప్రధాని నరేంద్ర మోదీ

'చారిత్రక విజయాన్ని అందించండి'

ఉత్తరప్రదేశ్ నాలుగో దశ ఎన్నికల నాటికే.. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి డబుల్ సెంచరీ సీట్లను సాధిస్తుందని అఖిలేశ్​ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కూటమికి చారిత్రక విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు అఖిలేశ్​. ఈ క్రమంలోనే అధికార భాజపాపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చూడండి: 'దావూద్​' కేసులో నవాబ్​ మాలిక్​ అరెస్ట్​- మార్చి 3 వరకు ఈడీ కస్టడీలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.