ETV Bharat / bharat

UP election 2022: 'భాజపా అధికారంలోకి వస్తే.. ఉచితంగా 'డబుల్​ రేషన్​''

author img

By

Published : Feb 2, 2022, 5:00 AM IST

CM Yogi Adityanath
CM Yogi Adityanath

యూపీలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతినెలా ఉచితంగా డబుల్​ రేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

UP election 2022: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఉతర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్ అటువంటి హామీతో ప్రజల ముందుకు వచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి కుటుంబానికి నెలనెల 'డబుల్​ రేషన్​' అందిస్తుందని హామీ ఇచ్చారు. గాజియాబాద్​లో ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొన్నారు.

'రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. కరోనా టీకా రెండు డోసులు అందించినట్లే ప్రతినెలా డబుల్​ రేషన్​ ఉచితంగా పంపిణీ చేస్తాం' అని యోగి హామీ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 135 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకా​, చికిత్స, పరీక్షలు చేస్తున్నారు. అయితే "టీకా విషయంలో తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నించారు. ఇది భాజపా వ్యాక్సిన్ అని, టీకాలు వేసుకోవద్దన్నారు. అది భాజపా టీకా కాబట్టి భాజపాకు మాత్రమే ఓటు వేస్తామని వారికి చెప్పండి" అని యోగి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 2017లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భాజపాకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచుకున్నాయని విపక్షాలను దుయ్యబట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Union budget 2022: నవ భారత్​ కోసం 'బూస్టర్​ డోస్​' బడ్జెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.