ETV Bharat / bharat

3.5 అడుగుల వరుడు.. 4 ఫీట్ల యువతి.. పెళ్లితో ఒక్కటైన మరుగుజ్జులు

author img

By

Published : Jul 30, 2023, 10:45 PM IST

Unique Wedding In Bihar : బిహార్​లో ఇద్దరు మరుగుజ్జుల పెళ్లి ఘనంగా జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో.. సంప్రదాయబద్దంగా మరుగుజ్జు వధూవరులు ఒక్కటయ్యారు. స్థానిక గాధాదేవి ఆలయంలో 3.5 అడుగులున్న యువకుడు, నాలుగు ఫీట్ల ఎత్తున్న యువతి.. వివాహా బంధంలోకి అడుగుపెట్టారు.

dwarves-wedding-in-bihar-3-feet-groom-married-to-4-feet-bride-in-bihar
బిహార్​లో మరుగుజ్జుల పెళ్లి

Dwarves Wedding In Bihar : 3.5 అడుగులున్న యువకుడు, నాలుగు ఫీట్ల ఎత్తున్న యువతి వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఈ మరుగుజ్జుల పెళ్లి బిహార్​లో సారణ్​ జిల్లాలో జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో.. సంప్రదాయబద్దంగా స్థానిక గాధాదేవి ఆలయంలో మరుగుజ్జు వధూవరులు ఒక్కటయ్యారు.

ఇదీ కథ
లెరువా ప్రాంతానికి చెందిన రోహిత్​ శారీరకంగా ఎదగలేదు. కేవలం 3.5 అడుగుల మాత్రమే ఉంటాడు. దీంతో అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయినా రోహిత్​ పెళ్లి చేసేందుకు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేశారు అతని కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే.. సారణ్​ జిల్లాలోని ఖబ్సీ ప్రాంతానికి చెందిన నేహా గురించి వారికి తెలిసింది. ఆమె కూడా కేవలం నాలుగు అడుగులు మాత్రమే ఉందని సమాచారం అందింది. నేహా కుటుంబ సభ్యులు సైతం వరుడి కోసం వెతుకుతున్నట్లు తెలిసింది.

dwarves-wedding-in-bihar-3-feet-groom-married-to-4-feet-bride-in-bihar
మరుగుజ్జుల పెళ్లి
dwarves-wedding-in-bihar-3-feet-groom-married-to-4-feet-bride-in-bihar
మరుగుజ్జుల పెళ్లి

దీంతో ఆలస్యం చేయకుండా నేహా కుటుంబాన్ని సంప్రదించారు రోహిత్​ కుటుంబ సభ్యులు. ఇరువురి కుటుంబ సభ్యులు రోహిత్​, నేహా పెళ్లి చేసేందుకు అంగీకరించారు. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యుల బంధువులు హాజరయ్యారు. అనంతరం మరుగుజ్జుల పెళ్లి చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మథురాలోని జవహర్‌లాల్ నెహ్రూ కళాశాలలో.. రోహిత్ ఇంటర్మీడియట్​ పూర్తి చేసినట్లు అతడి సోదరుడు అమర్​కుమార్​ తెలిపాడు. ఎత్తు​ కారణంగా​ రోహిత్​ వేధింపులు, వివక్షను ఎదుర్కొన్నాడని అమర్​ కుమార్​ వివరించాడు. తన సోదరుడి వివాహం జరిగినందుకు అమర్​ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నేహా కేవలం ఐదో తరగతి మాత్రమే చదువుకుందని.. అయినా ఆమె చాలా తెలివైనదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

3.5 అడుగుల వరుడు.. 4 ఫీట్ల యువతి

ఒక్కటైన మరుగుజ్జు జంట.. అంగరంగ వైభవంగా పెళ్లి..
Unique Wedding In Uttarpradesh : కొద్ది రోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఓ మరుగుజ్జు జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అలీగఢ్​ జిల్లాలోని జీవన్​గఢ్​ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఇమ్రాన్​ ఏడుగురు తోబుట్టువుల్లో చిన్నవాడు. ఇమ్రాన్​ పొడవు కేవలం 3 అడుగుల 4 అంగుళాలే. దీంతో ఇమ్రాన్​కు తగ్గ వధువు దొరకడం కష్టంగా మారింది. ఇమ్రాన్​ హాటల్​లో పనిచేస్తూ.. తన తల్లి బిర్జిస్​తో కలిసి ఉంటున్నాడు. ఇమ్రాన్​కు తగ్గ వధువు కోసం కుటుంబసభ్యులు వెతికే పనిలో ఉండగా..​ తల్లి బిర్జిస్​కు పట్వారీ నాగ్లాలోని భగవాన్​గడి ప్రాంతానికి చెందిన 3 అడుగుల పొడవుండే ఖుష్బూ గురించి తెలిసింది. వెంటనే ఇమ్రాన్​ తల్లి.. ఖుష్బూ కుటుంబసభ్యులతో మాట్లాడింది. వారు కూడా పెళ్లికి అంగీకరించారు. ఆదివారం జరిగే పెళ్లి కోసం ఇమ్రాన్​ను అతని కుటుంబసభ్యులు తలపాగాతో పాటుగా.. నోట్ల దండ వేసి వరుడిగా ముస్తాబు చేశారు. ఆదివారం ఇరువురి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.