ETV Bharat / bharat

'ఆ రాష్ట్రాల్లో ఐదు రెట్ల వేగంతో కొవిడ్​ 2.0 వ్యాప్తి'

author img

By

Published : Apr 30, 2021, 5:38 PM IST

Covid virus
కరోనా వైరస్​

దేశంలో కరోనా​ గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్ వ్యాప్తి 5 రెట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. కేసుల వృద్ధిలోనూ గరిష్ఠ స్థాయులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలో కొవిడ్​ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొంది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. రెండో దశ కొవిడ్​-19 వ్యాప్తి రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​లో గతంలో కంటే 5 రెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఛత్తీస్​గఢ్​లో 4.5 రెట్లు, దిల్లీలో 3.3 రెట్లుగా పెరిగిందని తెలిపింది.

Covid virus
వివిధ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి

గత 14 రోజుల్లో కేసుల తీరు, ఆందోళనకరంగా ఉన్న రాష్ట్రాల వివరాలను వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, ఛత్తీస్​గడ్​, దిల్లీ, రాజస్థాన్​, ఆంధ్రప్రదేశ్​లో కేసులు గతంలో కంటే గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొంది. కర్ణాటక, కేరళ, బంగాల్​, తమిళనాడు, గోవా, ఒడిశాల్లో గరిష్ఠ స్థాయులే కాక, కేసుల వృద్ధిలోనూ గరిష్ఠాన్ని తాకినట్లు తెలిపింది.

Covid virus
గత 14 రోజుల్లో దేశంలో కేసుల తీరు
Covid virus
అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాలు

మెడికల్​ ఆక్సిజన్​ ఉత్పత్తి, సరఫరాపై రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నామని పేర్కొంది ఆరోగ్య శాఖ. 23 రాష్ట్రాలకు 8,593 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ సరఫరా చేసినట్లు తెలిపింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో వినియోగిస్తున్న ఆక్సిజన్​పై ఆడిట్​ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది ఆరోగ్య శాఖ.

ఇదీ చూడండి: మూడో దశ వ్యాక్సినేషన్​ కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.