ETV Bharat / bharat

'టైలర్' హత్యపై నిరసనల జ్వాల.. పోలీసుపై ఖడ్గంతో దాడి!

author img

By

Published : Jun 29, 2022, 11:02 PM IST

Udaipur tailor murder case: టైలర్ కన్హయ్యలాల్ హత్యను నిరసిస్తూ రాజస్థాన్​లో నిరసనలు జరిగాయి. ఓ వర్గం సభ్యులు మసీదు వైపు వెళ్తుండగా ఆందోళన తలెత్తింది. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఓ వ్యక్తి పోలీసుపై ఖడ్గంతో దాడి చేశాడు.

Kanhaiya Lal murder Udaipur
Kanhaiya Lal murder Udaipur

Rajasthan Tailor murder: రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో టైలర్ దారుణ హత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాజసముంద్ జిల్లాలోని భీమ్ పట్టణంలో ఓ వర్గం.. స్థానిక మసీదు వైపుగా ర్యాలీగా వెళ్లడం ఉద్రిక్తతలకు దారి తీసింది. 'మతపరమైన స్థలంపై దాడి చేసేందుకు కొంతమంది ర్యాలీగా వెళ్లారు. పోలీసులపై రాళ్లు సైతం విసిరారు. మసీదు వైపు వెళ్లకుండా నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి పోలీసుపై ఖడ్గంతో దాడి చేశాడు. గాయపడ్డ పోలీసును ఆస్పత్రికి తరలించాం' అని డీజీపీ ఎంఎల్ లాఠర్ తెలిపారు.

Rajasthan protest tailor murder: మరికొన్ని ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయని అధికారులు తెలిపారు. రాజ్​సముంద్​లో హిందూ వర్గాలు నగర పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించాయని పేర్కొన్నారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారని వెల్లడించారు. వారిని నియంత్రించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపు చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు, అనూప్​గఢ్​లో హిందూ సంఘాలు సబ్​డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాయి. హనుమాన్ ఛాలిసాను పఠించాయి.

Kanhaiya Lal murder Udaipur: ఉదయ్​పుర్​కు చెందిన టైలర్ కన్హయ్యలాల్​ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు సోమవారం దారుణంగా హత్య చేశారు. కత్తులతో తల నరికేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందునే కన్హయ్యను దుండగులు హత్య చేశారు. నిందితులను భీమ్ పట్టణంలోనే పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: కన్హయ్యను చంపిన వారికి పాక్​తో లింకులు.. కరాచీలో 45 రోజులు శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.