ETV Bharat / bharat

కన్హయ్యను చంపిన వారికి పాక్​తో లింకులు.. కరాచీలో 45 రోజులు శిక్షణ

author img

By

Published : Jun 29, 2022, 6:03 PM IST

udaipur killing
ఉదయ్​పుర్​ హత్య కేసు నిందితులకు పాక్​తో సంబంధాలు

Udaipur Killing: ఉదయ్​పుర్​లో టైలర్ కన్హయ్య లాల్ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఉద్దరు ప్రధాన నిందితులకు పాకిస్థాన్​తో సంబంధాలు ఉన్నట్లు రాజస్థాన్ హోంమంత్రి వెల్లడించారు. నిందితుల్లో ఒకరు కరాచీలో 45 రోజుల పాటు ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ కేసును తమ చేతుల్లోకి తీసుకున్న ఎన్​ఐఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది.

Udaipur Murder: రాజస్థాన్​ ఉదయ్​పుర్​లో జరిగిన దారుణ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే అంతర్జాల సేవలు నిలిపివేసింది. ముందు జాగ్రత్త చర్యగా 30 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. కేసు విచారణను అత్యంత వేగంగా చేపట్టింది. ఇద్దరు ప్రధాన నిందితులను ఘటన జరిగిన రెండు మూడు గంటల్లోపే అరెస్టు చేసింది. ఆ మరునాడే వారితో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేసింది. అయితే ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్న ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పాకిస్థాన్​తో సంబంధాలు: భారత్​లో ఎప్పుడు ఉగ్రవాద ఘటనలు జరిగినా పాకిస్థాన్​తో సంబంధాలు ఉండటం సాధారణంగా మారింది. ఇప్పుడు ఉదయ్​పుర్​లో జరిగిన టైలర్​ కన్హయ్య లాల్​ హత్యకు కూడా పాకిస్థాన్​తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకడైన గౌస్​ మహమ్మద్​కు పాకిస్థాన్​తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు రాజస్థాన్ హోంమంత్రి రాజేంద్ర యాదవ్ వెల్లడించారు. అతడు 2014-15లో కరాచీలో 45 రోజుల పాటు ఉగ్రశిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2018-19లో అరబ్ దేశాలకు కూడా వెళ్లినట్లు చెప్పారు. గతేడాది నేపాల్​లో ఉన్నట్లు తెలిసిందన్నారు.

ఈ హత్యకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు తెలియడం వల్ల కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్​ఐఏ) అప్పగించింది రాజస్థాన్ ప్రభుత్వం. వెంటనే దర్యాప్తు చేపట్టిన ఎన్​ఐఏ బృందానికి ప్రాథమిక విచారణలో నిందితులకు సంబంధించి కీలక విషయాలు తెలిశాయి. ఇద్దరు నిందితులు గౌస్​ మహమ్మద్​, రియాజ్​ అక్తర్​కు పాకిస్థాన్​తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు తేలింది. వారిద్దరూ పాకిస్థాన్​లో ఉన్నవారితో తరచూ మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. రియాజ్ అక్తర్​కు అనుమానిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. పాకిస్థాన్ సంస్థ 'దావత్-ఎ-ఇస్లామీ'తో రిజాయ్​కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని దర్యాప్తు అధికారిక వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్య సహా అనేక ఇతర ఉగ్రవాద సంఘటనలకు ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది సభ్యులను గుర్తించినట్లు సమాచారం.

మంగళవారం కన్హయ్య హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి ఉదయ్‌పుర్‌కు చేరుకుంది ఎన్‌ఐఎ దర్యాప్తు బృందం. ఎన్​ఐఏ బృందానికి రాజస్థాన్​ పోలీసులు, సిట్​, ఏటీఎస్​ సహకరిస్తోంది. ఈ బృందాలన్నీ హత్య జరిగిన ప్రదేశాన్ని బుధవారం సందర్శించాయి.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ ఈ ఘటన జరిగిన మరునాడే అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలను భయాందోళను గురి చేసేందుకు నిందుతులు ఈ కిరాతక చర్యకు పాల్పడినట్లు చెప్పారు. నిందితులకు ఇతర దేశాలతో సంబంధాలున్నట్లు తెలిసినందు వల్ల చట్టవ్యతిరేక కార్యకాపల నిరోధక చట్టం(UAPA)కింద కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై కేసును ఎన్​ఐఏ దర్యాప్తు చేస్తుందని రాజస్థాన్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

ఎన్​కౌంటర్​ లేదా ఉరి: తన తండ్రిని దారుణంగా హత్య చేసిన కిరాతకులను ఎన్​కౌంటర్​ చేయాలని, లేదా ఉరి తీయాలని టైలర్​ కన్హయ్య కుమారుడు డిమాండ్ చేశాడు. అప్పుడే ఇలాంటి దారుణాలకు పాల్పడాలనేవారు భయపడతారని తెలిపాడు.
ఉదయ్​పుర్​లో మంగళవారం జరిగిన దారుణ హత్యకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.