ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో పేలుడు- అమరులైన ఇద్దరు జవాన్లు

author img

By

Published : Oct 30, 2021, 7:02 PM IST

Updated : Oct 30, 2021, 7:48 PM IST

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు.

Explosion reported on LoC in Rajouri
జమ్ముకశ్మీర్​లో పేలుడు

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.

నౌషెరా సెక్టార్​లోని కలాల్ ప్రాంతంలో సైనికులు గస్తీ నిర్వహిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడగా... వారిని చికిత్స కోసం స్థానిక మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అక్కడ వారు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు.

Last Updated :Oct 30, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.