ETV Bharat / bharat

చర్చలు భేష్​: భారత్​-చైనా సంయుక్త ప్రకటన

author img

By

Published : Jan 25, 2021, 8:37 PM IST

Sino-India joint statement after military talks
చర్చలు భేష్​: భారత్​-చైనా సంయుక్త ప్రకటన

ఆదివారం జరిగిన 9వ దఫా చర్చలపై భారత్​-చైనా సంయుక్త ప్రకటన చేశాయి. ఆచరణాత్మక, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వెల్లడించాయి. వాస్తవాధిన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై అభిప్రాయలు ఇచ్చిపుచ్చుకున్నట్టు స్పష్టం చేశాయి.

భారత్, చైనాల మధ్య ఆదివారం జరిగిన తొమ్మిదో విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగినట్లు ఇరుదేశాలు వెల్లడించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరుదేశాలు.. ఆచరణాత్మక, నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపాయి.

ఈ చర్చల ద్వారా.. రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకం, అర్థం చేసుకోవడం పెరిగిందని సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన ఫ్రంట్‌లైన్ బలగాలను.. వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి.. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా వీలైనంత త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి.

గతేడాది మేలో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు చెలరేగాయి. ఎన్ని సార్లు చర్చలు జరిపినా.. ఇంకా ఆ సమస్య ఒక కొలిక్కి రాలేదు.

ఇదీ చూడండి:- 'భారత్​-చైనా 'సిక్కిం ఘర్షణ' చిన్నదే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.